Passport: పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోనే వారు ఇంటర్నెట్‌లో ఉండే నకిలీ వెబ్‌సైట్లతో దూరంగా ఉండాల‌ని,  అధికారిక పాస్‌పోర్ట్ వెబ్‌సైట్ లోనే ఆప్లై చేసుకోవాల‌ని రీజనల్ పాస్‌పోర్టు ఆథారిటీ సూచించింది. ఈ వెబ్‌సైట్లు ప్రజలను మోసాలకి గురిచేస్తున్నాయి.  

Passport: ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పాస్​పోర్టు వినియోగం ఎక్కువైంది. విదేశాలకు వెళ్లాలంటే పాస్​పోర్టు తప్పనిసరి కావడంతో పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. అలాగే పాస్ పోర్ట్ అంత‌ర్జాతీయంగా గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుండడంతో ఎక్కువ మంది పాస్ పోర్టు కోసం ఆప్లై చేయ‌డానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా పాస్​పోర్టు సేవా కేంద్రాల్లో రద్దీ పెరిగిపోతోంది. అందులోనూ దరఖాస్తు కేంద్రాలు కూడా పరిమిత సంఖ్యలో ఉండడంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. 

ఈ క్ర‌మంలో కొన్ని ఫేక్ వెబ్‌సైట్లు.. పాస్‌పోర్టు సేవలను అందిస్తామని.. మోసాలకు పాల్పడుతున్నాయని, కావున ఇలాంటి వెబ్‌సైట్స్‌ను నమ్మొద్దని చెప్పారు రీజనల్ పాస్‌పోర్టు ఆఫీస్ - హైదరాబాద్ హెచ్చ‌రించింది. ఈ క్ర‌మంలో.. విదేశాలకు వెళ్లాలనుకునే పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు, ఇప్పటికే పాస్‌పోర్టు పొందిన వారికి రీజనల్ పాస్‌పోర్టు ఆథారిటీ నూత‌న మార్గదర్శకాలు విడుదల చేసింది. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారు అధికారిక వెబ్‌సైట్‌ www.passportindia.gov.in లో పాస్ పోర్టు ఆప్లై చేసుకోవ‌చ్చునని, ఈ సైట్ పూర్తిగా సురక్షితమ‌నీ, ఇదే అధికారిక వెబ్‌సైట్ అని తెలిపారు.

Read also: https://telugu.asianetnews.com/andhra-pradesh/ap-cid-searches-on-retired-ias-officer-lakshmi-narayana-house-r3vz9h

వెబ్‌సైట్ ద్వారా కాకుండా, మీరు యాప్ ద్వారా కూడా పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకోవచ్చన‌నీ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ మొబైల్స్‌ కోసం తయారు చేసిన ఎంపాస్‌పోర్ట్ సేవ (mPassport Seva) యాప్ ద్వారా కూడా పాస్ పోర్టు ఆప్లే చేసుకోవ‌చ్చున‌ని తెలిపారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చాలా మంది అంతర్జాతీయ ప్రయాణీకులు త‌మ పాస్ పోర్టు గడువు గుర్తించలేక‌పోతున్నార‌నీ, పాస్‌పోర్టు గడువు ముగియ‌డానికి..క‌నీసం ఆరు నెలల గడువు ముందుగానే రీన్యూవ‌ల్ చేసుకోవాలని సూచించారు. 

అలాగే.. మైనర్‌ల పాస్‌పోర్ట్‌లు గ‌డువు కాలం తక్కువ చెల్లుబాటు వ్యవధి (5 సంవత్సరాలు) కలిగి ఉంటుంది.కాబట్టి వాటిని కూడా సాధ్య‌మ‌నంత త్వ‌ర‌గా రిన్యూవ‌ల్ చేసుకోవాలి. పాస్‌పోర్ట్ క‌లిగిన వారంద‌రూ చెల్లుబాటును తనిఖీ చేసుకోవాలని సూచించారు. కొన్ని దేశాలు పాస్‌పోర్టులో రెండు పేజీలు, అంతకంటే తక్కువ ఉంటే వీసాలు మంజూరు చేయడం లేదని తెలియజేశారు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా పాస్‌పోర్టులు రీన్యూ చేయించుకోవాలని సూచించారు.

Read also: https://telugu.asianetnews.com/international/omicron-four-times-more-transmissible-than-delta-in-new-study-r3uhh0

నెట్టింట్లో www.indiapassport.org, www.on1ine- passportindia.com, www.passportindiaportal.in, www.passport- india.in, www.passport-seva.in, www.app1ypassport.org వంటి నకిలీ వెబ్‌సైట్లు ఉన్న‌య‌ని.. అలాంటి సైట్ల‌కు దూరంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. దరఖాస్తుదారులు ప్రాసెసింగ్ కోసం తగిన పత్రాలను సమర్పించని సందర్భాల్లో దరఖాస్తుదారుని అపాయింట్‌మెంట్‌ని రీషెడ్యూల్ చేస్తామ‌ని తెలిపారు. ప్రతి దరఖాస్తుదారుడు గరిష్టంగా మూడు సార్లు PSK/PSLK/POPSK వద్ద వారి అపాయింట్‌మెంట్ ను రీషెడ్యూల్ చేసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. 


పాస్‌పోర్ట్ సేవలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం, అధికార వెబ్‌సైట్ www.passportindia.gov.in  లేదా 1800- 258-1800 (టోల్ ఫ్రీ) 040 - 27715333 / 27715115 కు సంప్ర‌దించాల‌ని పేర్కొన్నారు.ఇత‌ర ఫిర్యాదుల పరిష్కారం కోసం..రిజిన‌ల్ పాస్‌పోర్ట్ కార్యాల‌యాన్ని సంప్రదించవచ్చు. లేదా rpo.hyderabd@mea.gov.in లో దరఖాస్తుదారులు ప్రాంతీయ పాస్‌పోర్ట్‌లోని పబ్లిక్ ఎంక్వైరీ కౌంటర్‌లను సందర్శించవచ్చున‌ని రిజిన‌ల్ పాస్‌పోర్ట్ ఆధారిటీ తెలిపింది.