మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీ నారాయణ (Lakshminarayana ) ఇంట్లో ఆంధ్రప్రదేశ్ సీఐడీ (AP CID) అధికారులు సోదాలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లక్ష్మీ నారాయణ.. ఆయన వద్ద పనిచేశారు.
మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మి నారాయణ (Lakshminarayana ) ఇంట్లో ఆంధ్రప్రదేశ్ సీఐడీ (AP CID) అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని లక్ష్మి నారాయణ నివాసం ఈ సోదాలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఆయన కార్యాలయంలో లక్ష్మి నారాయణ పనిచేశారు. తన పదవీ విరమణ తర్వాత.. చంద్రబాబు విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ద్వారా సేవలందించారు. యువకులకు శిక్షణ ఇచ్చే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ అధికారులు లక్ష్మీ నారాయణ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
