శాఖకో సలహాదారున్ని నియమిస్తున్న సీఎం కెబినెట్ మంత్రి హోదాతో కొనసాగింపు

తెలంగాణ రాష్ట్ర పాలనలో అసలు కంటే కొసరే ఎక్కువుతున్నట్లోంది. పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి శాఖకు మంత్రిని నియమించడం దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నదే. అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ లో మాత్రం ప్రతి శాఖకు మంత్రితో పాటు ఒక సలహాదారుడిని కూడా నియమించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు ఉన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారుల సంఖ్య ఎనిమిదికి మించింది. ఇది ఇప్పట్లో ఆగేలా కూడా లేదు.ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన వారికి కెబినెట్ మంత్రి హోదాను కూడా ప్రభుత్వం కల్పిస్తుంది.

ఇప్పటి వరకు ఇలా విద్యాసాగర్ రావు.. నీటిపారుదల, ఏకే గోయిల్... ప్లానింగ్ అండ్ ఎనర్జీ, రామ్ లక్ష్మణ్... సంక్షేమం, పాపారావు.. ప్రభుత్వ విధానాలు, కెవి రమణాచారి.. కల్చరల్, టూరిజం, ఎండోమెంట్ కు సలహాదారులుగా ఉన్నారు.

తాజాగా సీఎస్ గా పదవీవిరమణ చేసిన రాజీవ్ శర్మను, మాజీ ఎంపీ వివేక్ ను కూడా ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు.గతంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లోకి జంప్ చేసిన డి. శ్రీనివాస్ ను కూడా కేసీఆర్ ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు.

మరి వీరి సలహాలను ప్రభుత్వం ఏమైనా తీసుకుంటుందా.. అవేవైనా రాష్ట్రఅభివృద్ధికి ఉపయోగపడుతున్నాయా అనేది కేసీఆర్ సర్కారే సెలవివ్వాలి.