Asianet News TeluguAsianet News Telugu

జగన్ అక్రమాస్తుల కేసు: బీపీ ఆచార్య పిటిషన్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య వేసిన పిటిష‌న్‌పై గురువారం హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. సీబీఐ కోర్టులో జరుగుతున్న లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జిషీట్ విచార‌ణ‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాక‌రించింది

adjournment of hearing on bp acharya petition ksp
Author
Hyderabad, First Published May 20, 2021, 3:55 PM IST

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య వేసిన పిటిష‌న్‌పై గురువారం హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. సీబీఐ కోర్టులో జరుగుతున్న లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జిషీట్ విచార‌ణ‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాక‌రించింది.

ఈ ఏడాది మార్చి 10న సీబీఐ కోర్టు.. లేపాక్షి కేసులో బీపీ ఆచార్య‌పై అభియోగాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. ఈ నిర్ణ‌యాన్ని బీపీ ఆచార్య హైకోర్టులో స‌వాలు చేశారు. అవినీతి నిరోధ‌క చ‌ట్టం కింద స‌వాల్ చేస్తూ ఉన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు.

Also Read:వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ..

లేపాక్షి ఛార్జిషీట్‌పై విచార‌ణ‌ను నిలిపేస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని ఆయన పిటిష‌న్‌లో కోరగా... దీనికి హైకోర్టు నిరాక‌రించింది. దీనిపై త‌దుప‌రి విచార‌ణ‌ను జూన్ 7కు వాయిదా వేసింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios