అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఇదివరకే జగన్, సీబీఐను ఆదేశించింది. 

ఈ నెల 7న విచారణ జరిగిన సమయంలో కౌంటర్ దాఖలుకు సమయం కోరిన జగన్, సీబీఐ తరపు న్యాయవాదులు.. ఇవాళ కూడా మరోసారి గడువు కోరారు. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయడానికి చివరి అవకాశం ఇచ్చిన సీబీఐ కోర్టు.. విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.

జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోరిన విషయం తెలిసిందే.

కాగా, ఆస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు మే 7 వతేదీ శుక్రవారంనాడు విచారణ చేపట్టింది. 

జగన్ బెయిల్‌ రద్దుపై వెల్లువెత్తుతున్న డిమాండ్లు: లిస్ట్‌లోకి చింతా మోహన్...

ఈ విషయమై  కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని వైఎస్ జగన్, సీబీఐ తరపు న్యాయవాదులు  కోర్టును కోరారు. సాక్షులను ప్రభావితం చేస్తున్నారని జగన్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.

ఈ కారణంగా బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై విచారణను  ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.గత ఎన్నికల్లో వైసీపీ నుండి నర్సాపురం నుండి రఘురామకృష్ణం రాజు పోటీ చేశారు. 

అయితే గత ఏడాదిలో  పార్టీ వ్యతిరేకకార్యకలాపాలకు పాల్పడుతున్నందున రఘురామకృష్ణంరాజుపై వైసీపీ వేటేసింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు కూడ వైసీపీ ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 27న ఏపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.