Asianet News TeluguAsianet News Telugu

హద్దు మీరితే అంతే సంగతులు: అడిషనల్ డిజిపి స్వాతి లక్రా, డిఐజి సుమతి

పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, బాధ్యులు ఒకటి గుర్తెరగాలని మీరు చేసిన తప్పిదాలే రేపు మీ కుటుంబంలోని మహిళలకు కూడా వేరే వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందని అందుచేత సమాజంలో ప్రతి మహిళను గౌరవించాలని కోరారు. మార్పు మీ నుండే మొదలుకావాలని చెప్పారు.

Additional DGP Swathi Lakra sugession to parents over kids
Author
Hyderabad, First Published Oct 14, 2020, 5:51 PM IST

తెలంగాణ మహిళా భద్రత విభాగం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను వేధించిన మరియు  సోషల్ మీడియా వేదికలపై మహిళలపై అనుచిత వాఖ్యలు చేయటమో, ఇతర మార్గాలలో యువతులను వేధించటమో చేసిన 200 మందికి పైగా బాధ్యులను రాష్ట్ర షీ టీమ్స్ గుర్తించి వారికి రాష్ట్ర మహిళా భద్రత విభాగం ప్రధాన కార్యాలయం నుండి ఆన్ లైన్ కౌన్సెలింగ్ నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే తప్పిదాలు చేసిన బాధ్యుల్లో మార్పు తీసుకురావటానికి అవలంభించే విధానమే ఈ ఆన్ లైన్ కౌన్సెలింగ్. ఈ కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం అడిషనల్ డిజిపి శ్రీమతి స్వాతి లక్రా మాట్లాడుతూ బాధ్యులందరు ఇక మీదట జాగ్రత్తగా మసలుకోవాలని, ఏదైనా పోలీసులు కొంత మేరకే భరించగలరని హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

బాధ్యుల తల్లిదండ్రులు కూడా ఈ కౌన్సెలింగ్ లో హాజరు కావటంతో వారికి కూడా పలు సూచనలు చేశారు. పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, బాధ్యులు ఒకటి గుర్తెరగాలని మీరు చేసిన తప్పిదాలే రేపు మీ కుటుంబంలోని మహిళలకు కూడా వేరే వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందని అందుచేత సమాజంలో ప్రతి మహిళను గౌరవించాలని కోరారు. మార్పు మీ నుండే మొదలుకావాలని చెప్పారు.


ఇట్టి కౌన్సెలింగ్ లో పాల్గొన్న మహిళా భద్రత విభాగం డిఐజి శ్రీమతి సుమతి మాట్లాడుతూ దేశంలో ఈ విధమైన కౌన్సెలింగ్ కి ఒక విధానమంటూ లేదని మన రాష్ట్రంలోనే ఒక మోడల్  కౌన్సెలింగ్ ని రూపొందించి ఇటువంటి తప్పిదాలకు పాల్పడిన వ్యక్తులను మార్చగలుతున్నామని ఇందుకు అన్ని జిల్లాల షీ టీమ్ లు చేస్తున్న కృషి మరువలేదని చెప్పారు. ప్రతి జిల్లా షీ టీమ్ మహిళల సమస్య పట్ల చాలా వేగంగా స్పందిస్తున్నారని ఇదే కొనసాగించాలని అన్నారు.


అలాగే ఈ కౌన్సెలింగ్ లో ప్రముఖ సైకాజిస్టులు కూడా పాల్గొని బాధ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రముఖ విద్యావేత్త, ఫ్లేమ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఇందిరా పారిఖ్ కూడా పాల్గొని బాధ్యుల్లో మార్పునకు కొన్ని సూత్రాలు చెప్పారు. అలాగే ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ గీతా చల్ల పాల్గొని బాధ్యులతో కొన్ని ప్రయోగాత్మక విధానాలను అవలంభిస్తూ వారి తప్పును తెలుసుకొని వారిలో మార్పు వచ్చేలా చేశారు. ఇందులో కొంత మంది వ్యక్తులు తమలో మార్పు వచ్చిందని తమ తమ జిల్లా షీ టీమ్ లు తమ పరివర్తన దిశగా ఎంతో ప్రయత్నం చేశాయని ఇక మీదట ఇలాంటి తప్పిదాలకు పాల్పడబోమని చెప్పటం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios