Asianet News TeluguAsianet News Telugu

డింపుల్ - డీసీపీ వివాదంలో కొత్త ట్విస్ట్ .. తెరపైకి జంతుహింస, అడ్డుకున్నందుకే ఇలా : హయాతి లాయర్ వ్యాఖ్యలు

సినీనటి డింపుల్ హయాతి, ఐపీఎస్ రాహుల్ హెగ్డే వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీసీపీ జంతువులను హింసిస్తుంటే డింపుల్ అడ్డుకోవడంతో ఆయన కక్ష పెంచుకున్నారని , ఈ క్రమంలోనే డింపుల్‌పై తప్పుడు కేసు పెట్టారని ఆమె తరపు లాయర్ అంటున్నారు. 
 

actress dimple hayathi lawyer comments on dcp rahul hegde ksp
Author
First Published May 25, 2023, 2:20 PM IST

సినీనటి డింపుల్ హయాతి, ఐపీఎస్ రాహుల్ హెగ్డే వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వివాదంపై డింపుల్ న్యాయవాది స్పందించారు. డీసీపీ జంతువులను హింసిస్తుంటే డింపుల్ వారించిందని.. ఆ కక్షతోనే డింపుల్‌పై ఆయన తప్పుడు కేసు పెట్టారని న్యాయవాది ఆరోపించారు. డింపుల్ ఎక్కడా కారును తన్నిన ఫుటేజ్ లేదని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో డింపుల్ మెంటల్ స్ట్రెస్‌కు గురైందని.. చివరికి బయటకు వెళ్లేందుకు కూడా డింపుల్ భయపడుతోందని లాయర్ చెప్పారు. డింపుల్ పట్ల డీసీపీ అసభ్యంగా ప్రవర్తించారని.. కేసును తాము లీగల్‌గానే ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలావుండగా డీసీపీతో వివాదంపై డింపుల్ కోర్టును ఆశ్రయించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. రోడ్డుపై వుండాల్సిన సిమెంట్ బారికేడ్స్, కోన్స్ ప్రైవేట్ స్థలంలోకి ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నిస్తున్నారు. డీసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని డింపుల్ వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించి బలమైన సాక్ష్యాధారాలను సేకరించే పనిలో డింపుల్‌గా వున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అసలు ప్రభుత్వం కేటాయించని క్వార్టర్స్‌లో వుండాల్సిన డీసీపీ స్థాయి వ్యక్తి.. ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో ఎందుకు వుంటున్నారని డింపుల్ తరపు న్యాయవాది ప్రశ్నిస్తున్నారు.

ALso Read: గన్‌మెన్లతో తిరిగే అధికారిని నేనేం చేస్తాను: కేసుపై స్పందించిన డింపుల్ హయతి

కాగా.. ఈ నెల 23న సినీ నటి డింపుల్ హయతిపై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. డింపుల్ హయతితో పాటు ఆమె స్నేహితుడు డేవిడ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో డింపుల్ హయతి నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో ట్రాఫిక్ డీసీపీగా ఉన్న ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కూడా నివాసం ఉంటున్నారు. అయితే రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని పార్కింగ్ ప్లేస్‌లో డేవిడ్ ఢీ కొట్టాడు. అయితే దీనిపై రాహుల్ హెగ్డే వాహన డ్రైవర్ చేతన్ కుమార్ డింపుల్ హయతి, డేవిడ్‌లను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే డింపుల్ హయతి కారును కాలితో తన్ని దూషణకు దిగినట్టుగా సమాచారం. 

ఈ ఘటనకు సంబంధించి డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ పోలీసులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కింద డింపుల్‌పై 353, 341,279 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి డింపుల్ హయతి, ఆమె స్నేహితుడు డేవిడ్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ గొడవ విషయంలో డింపుల్ హయతికి నచ్చజెప్పేందుకు యత్నించిన ఆమె పద్దతి మార్చుకోలేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios