Asianet News TeluguAsianet News Telugu

suresh died: తహసీల్దార్ విజయారెడ్డి హత్య... నిందితుడు సురేష్ మృతి

సోమవారం అబ్దుల్లాపూర్ మెట్ లో... విజయారెడ్డిని సురేష్ అనే వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయా రెడ్డిని ఆమె కార్యాలయంలో, ఆమె చాంబర్లో తలుపులు వేసి, పెట్రోలు పోసి కాల్చి చంపేశాడు.

Accused suresh died in hospital over  Tahsildar vijayareddy murder case
Author
Hyderabad, First Published Nov 7, 2019, 10:17 AM IST

తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ మృతి చెందాడు. విజయారెడ్డిని చంపే క్రమంలో... సురేష్ ఒంటికి కూడా నిప్పు అంటుంది. దీంతో... ఆయనకు 60శాతం గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేష్... గురువారం ఉదయం కన్నుమూశాడు. ఆయన చనిపోయిన విషయాన్ని ఆస్పత్రి వైద్యులు సురేష్ కుటుంబసభ్యులతోపాటు.. పోలీసులకు సమాచారం అందించారు. మరికాసేపట్లో అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. A

 AlsoRead Tahsildar vijayareddy: నా భర్త అమాయకుడు.. నిందితుడు సురేష్ భార్య

కాగా.. సోమవారం అబ్దుల్లాపూర్ మెట్ లో...  విజయారెడ్డిని సురేష్ అనే వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయా రెడ్డిని ఆమె కార్యాలయంలో, ఆమె చాంబర్లో తలుపులు వేసి, పెట్రోలు పోసి కాల్చి చంపేశాడు. ఆమె మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో మాట్లాడే నెపంతో వచ్చి ఈ దౌర్జన్యానికి ఒడిగట్టాడు. కౌలు రైతుకు, భూ యజమానికి మధ్య తలెత్తిన వివాదంలో ఆమె బలైపోయారు.

AlsoRead ఎమ్మార్వో విజయారెడ్డి ఇంటికి సురేష్: భర్త సుభాష్ రెడ్డితో భేటీ, అందుకోసమేనా?...

తనకు పట్టా రాదనే ఉద్దేశంతోనే ఆమెను చంపినట్టు కౌలు రైతు సురేశ్‌ చెప్పాడు. మంటలు అంటుకున్న విజయారెడ్డిని రక్షించేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం గమనార్హం. నిందితుడు సురేష్ కూడా 60శాతం గాయపడగా... అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భూ వివాదంలో తహసీల్దార్ తనకు మద్దతు ఇవ్వనందుకే చంపేసినట్లు సురేష్ అంగీకరించాడు. కాగా.. సురేష్ వెనక మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. కాగా... ఈ రోజు ఉదయం సురేష్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశాడు. 

Also Read tahsildar Vijaya Reddy: మల్ రెడ్డిపై మంచిరెడ్డి సంచలన ఆరోపణలు

కాగా.. ఈ కేసు దర్యాప్తుని బుధవారమే.. ప్రత్యేక అధికారిని నియమించారు. విచారణాధికారిగా వనస్థలీపురం ఏసీపీ జయరాంని నియమించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కాగా.. దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు పోలీసులు సురేష్ కాల్ డేటాను పరిశీలించారు. ఘటనాస్థలంలో సురేష్ తోపాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా..విజయారెడ్డి హత్యకేసులో మరిన్ని నిజాలు బయటకు వెలుగు చూస్తున్నాయి. ఆఫీసులో సెక్యురిటీ పెంచాలని నెల క్రితమే విజయా రెడ్డి కలెక్టర్ ని కోరినట్లు తెలుస్తోంది. వివాదాస్పద భూములపై ఆందోళన పెరగుతుండటంతో.. గతంలోనే విజయారెడ్డి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. 

AlsoRead విజయారెడ్డి హత్య వెనుక టీఆర్ఎస్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అంతేకాకుండా సురేష్ కి చెందిన 9 ఎకరాల భూమిని మాజీ ప్రజాప్రతినిధికి అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన రోజు సురేష్ చాలా మందితో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు.  సురేష్ కాల్ లిస్టులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఉండటం గమనార్హం. హత్య చేసిన తర్వాత పక్కనే ఉన్న ఓ కారులోని వ్యక్తితో సురేష్ మాట్లాడినట్లు గుర్తించారు. కాగా.. సురేష్ ఎవరితో మాట్లాడాడో పోలీసులు ఆరా తీస్తున్నారు.

దర్యాప్తు కొనసాగుతుండగానే సురేష్ ఇలా అర్థాంతరంగా చనిపోవడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. సురేష్ మృతితో కేసును పోలీసులు పక్కన పెట్టేస్తారా.. లేదా నిజా నిజాలు తేలుస్తారా లేదా అనే ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయి
 

Follow Us:
Download App:
  • android
  • ios