Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మార్వో విజయారెడ్డి ఇంటికి సురేష్: భర్త సుభాష్ రెడ్డితో భేటీ, అందుకోసమేనా?

ఎమ్మార్వో విజయా రెడ్డి ఇంటికి కూడ సురేష్ వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుభాష్ రెడ్డితో సురేష్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. 

Suresh Discussed mro Vijaya Reddy husband Subash Reddyon nov 2
Author
Hyderabad, First Published Nov 7, 2019, 8:26 AM IST

హైదరాబాద్: భూ వివాదంలో అబ్దుల్లాపూర్‌మెట్టు  ఎమ్మార్వో విజయా రెడ్డిని ఇంటి వద్దే హత్య చేసేందుకు సురేష్ ప్లాన్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి వద్ద సాధ్యం కాకపోవడంతో కార్యాలయంలో ఆమెపై పెట్రోల్‌ పోసి హత్యకు పాల్పడినట్టుగా బావిస్తున్నారు. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ  కేసులో కీలకమైన సమాచారాన్ని పోలీసులు సేకరించారు.

ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో సురేష్ అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి ఎమ్మార్వో విజయా రెడ్డిని సజీవ దహనం చేశాడు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సురేష్ కూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

తన భూ వివాదానికి సంబంధించి సురేష్ కొన్ని రోజులుగా అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చి వెళ్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. గౌరెల్లిలోని భూ వివాదానికి సంబంధించి ఎమ్మార్వో విజయారెడ్డి భర్త సుభాష్ రెడ్డిని మధ్యవర్తి సహాయంతో సురేష్ హత్య చేయడానికి రెండు రోజుల ముందు కలిసినట్టుగా సమాచారం.

ఈ భూ వివాదం గురించి ఎమ్మార్వో విజయా రెడ్డి భర్త సుభాష్ రెడ్డితో సురేష్ ఏం మాట్లాడారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తునన్నారు. ఈ విసయమై సుభాష్ రెడ్డి నుండి కూడ కీలకమైన సమాచారాన్ని పోలీసులు సేకరించారని తెలుస్తోది.

విజయా రెడ్డి ఇంటికి వెళ్లే ముందు తాడోపేడో తేల్చుకొంటానని సురేష్ తన సన్నిహితులతో చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ సమాచారంపై పోలీసులు వాస్తవాలను తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. 

ఎమ్మార్వో విజయా రెడ్డిని ఇంటి వద్దే హత్య చేసేందుకు సురేష్ ప్రయత్నించాడా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ ఎందుకు ఎమ్మార్వో విజయారెడ్డి ఇంటికి వెళ్లాడు ... సురేష్ విజయా రెడ్డి ఇంటికి వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో ఉందా.. ఇంట్లో ఉంటే ఆమె సురేష్ తో మాట్లాడిందా, ఆమె ఇంట్లో లేని సమయంలో సురేష్ ఆమె ఇంటికి వెళ్లి సుభాష్ రెడ్డి ద్వారా తన భూ వివాదాన్ని పరిష్కరించుకొనే ప్రయత్నం చేశాడా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఏసీపీ జయరా‌మ్ ను నియమించింది. జయరామ్ నేతృత్వంలోని బృందం ఈ కేసు విషయమై విచారణను వేగవంతం చేసింది.
ఈ భూ వివాదానికి సంబంధించి సురేష్ కుటుంబసభ్యులను కూడ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎమ్మార్వో విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన తర్వాత సురేష్ పిచ్చివాడిగా రోడ్డుపై నడుచుకొంటూ వచ్చి కారులో ఉన్న వ్యక్తులతో మాట్లాడారు. ఈ దృశ్యాలను సీసీటీవీల్లో రికార్డయ్యాయి.

ఈ కారులో ఉన్న వ్యక్తులు ఎవరు సురేష్ కు వీళ్లకు ఉన్న సంబంధం ఏమిటనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. గౌరెల్లిలోని తనకు తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన భూమిలో ఆరు గుంటల భూవిని సురేష్ విక్రయించినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ భూమిని ఎవరికి సురేష్ విక్రయించాడనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరో వైపు సురేష్ సన్నిహితుడు డీసీఎం డ్రైవర్‌ నర్సింహ్మను కూడ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సురేష్ కాల్‌డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

తన భూ వివాదానికి సంబంధించి సురేష్ ఎంత కాలం క్రితం రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అసలు ఫిర్యాదు ఏమిటీ, ఫిర్యాదుపై రెవిన్యూ అధికారులు స్పందించారా, ఈ విషయమై ఫిర్యాదుదారుడికి ఏ రకమైన సమాచారాన్ని ఇచ్చారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ భూమి విషయమై సురేష్ తన కుటుంబసభ్యుల  మధ్య వివాదం నడుస్తుందని సమాచారం.

ఈ దిశగా కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎమ్మార్వో విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన రోజుతో పాటు అంతకు ముందు కూడ సురేష్ ఎవరెవరితో మాట్లాడారనే విషయమై పోలీసులు సురేష్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలు చదవండి

tahsildar Vijaya Reddy: మల్ రెడ్డిపై మంచిరెడ్డి సంచలన ఆరోపణలు

Tahsildar vijayareddy: నా భర్త అమాయకుడు.. నిందితుడు సురేష్ భార్య

విజయారెడ్డి హత్య వెనుక టీఆర్ఎస్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Follow Us:
Download App:
  • android
  • ios