దీక్షిత్ రెడ్డి హత్య కేసులో ముద్దాయి సాగర్ కు మరణశిక్ష...
డబ్బుల కోసం మైనర్ బాలుడిని కిరాతకంగా హతమార్చిన వ్యక్తికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది మహబూబాబాద్ కోర్టు.

మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కోర్టు ఓ హత్య కేసులో సంచలన తీర్పునిచ్చింది. 9యేళ్ల బాలుడు దీక్షిత్ ను అత్యంత కిరాతకంగా హతమార్చిన ముద్దాయి సాగర్ కు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సాగర్ 9యేళ్ల బాలుడి దీక్షిత్ ను డబ్బుల కోసం హతమార్చాడు. దీక్షిత్ ను కిడ్నాప్ చేసిన సాగర్.. ఓ యాప్ తో గొంతుమార్చి మాట్లాడుతూ తల్లిదండ్రులను డబ్బులు డిమాండ్ చేశాడు.
సాగర్ బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. బాలుడు అదృశ్యమవ్వడంతో వెతుకుతున్న తల్లిదండ్రులతో పాటూ తానూ వెతుకుతున్నట్లు నటిస్తూ.. వారితో కలిసి తిరిగాడు. అనుమానంతో పోలీసులు విచారించగా.. అతనే నిందితుడిగా తేలాడు.