తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం (chigurupati jayaram) హత్య కేసులో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నిందితులు బెదిరిస్తున్నట్లుగా సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం (chigurupati jayaram) హత్య కేసులో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నిందితులు బెదిరిస్తున్నట్లుగా సమాచారం. ఈ విషయం వెలుగులోకి రావడంతో బెదిరించిన నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డితో (rakesh reddy) పాటు నలుగురిని అరెస్ట్ చేశారు.
2019 జనవరి 30వ తేదీన డాక్టర్ చిగురుపాటి జయరాంను హనీట్రాప్ ద్వారా..జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి రాకేశ్ రెడ్డి తన నివాసానికి రప్పించాడు. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి డాక్టర్ జయరాంను నిర్భంధించి హత్య చేశాడు. తరువాత జయరాం మృతదేహాన్ని కారులోకి ఎక్కించి.. తన స్నేహితుడైన నల్లకుంట ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులును కలిసేందుకు ప్రయత్నించాడు.
ALso Read:చిగురుపాటి జయరాం హత్య కేసు: పోలీసుల పాత్రపై సుప్రీం ఆగ్రహం
అతను ఆ సమయంలో అందుబాటులో లేకపోవడంతో.. ఇబ్రహీంపట్నం ఏసీపీగా వున్న మల్లారెడ్డిని (acp malla reddy) రాకేశ్ సంప్రదించాడు. ఈ ఇద్దరు పోలీసు అధికార్ల సూచనతో హత్యను డ్రంక్ అండ్ డ్రైవ్‌గా చిత్రీకరించేందుకు కుట్రపన్నారు. ఏపీలోని నందిగామకు (nandigama) తీసుకెళ్లి.. కారుతో సహా మృతదేహాన్ని వదిలేసి తిరిగొచ్చేశాడు. ఇదిలా ఉండగా జయరాంను రాకేష్ చిత్ర హింసలు చేసే సమయంలో అక్కడే ఉన్న నిందితులు 11 వీడియోలు, 13 ఫొటోలను తీశారు. వీటన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా జయరాం శరీరంలో ఎటువంటి విష పదార్థాలు లేవని పోస్టుమార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది.
కోర్టుకు సమర్పించిన ఛార్జీషీటులో రాకేష్ రెడ్డిని మొదటి నిందితుడిగా పేర్కొన్న పోలీసులు, విశాల్‌ను ఏ2, శ్రీనివాస్ (వాచ్ మాన్)ను ఏ3, నగేష్ (రౌడీషీటర్)ను ఏ4, సూర్య ప్రసాద్ (కమెడియన్)ను ఏ5, కిషోర్ (సూర్య ప్రసాద్ స్నేహితుడు)ను ఏ6, సుభాష్ రెడ్డి (రియల్ ఎస్టేట్ వ్యాపారి)ను ఏ7, బిఎన్ రెడ్డి (టీడీపీ నాయకుడు)ను ఏ8, అంజిరెడ్డి (రియల్ ఎస్టేట్ వ్యాపారి)ను ఏ9, శ్రీనివాసులు (నల్లకుంట మాజీ ఇన్స్పెక్టర్)ను ఏ10, రాంబాబు (రాయదుర్గం మాజీ ఇన్స్పెక్టర్)ను ఏ11, మల్లారెడ్డి (ఇబ్రహీంపట్నం మాజీ ఏసిపి)ను ఏ 12గా పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో మొత్తం 73మందిని సాక్షులుగా పోలీసులు విచారించారు. వారిలో జయరాం మేనకోడలు శిఖా చౌదరిని (shika chowdary) 11వ సాక్షిగా, ఆమె బాయ్‌ఫ్రెండ్ సంతోష్ రావ్‌గా 13వ సాక్షిగా పేర్కొన్నారు.
