జైలు నుంచి తప్పించుకున్నా.. పూర్వ బుద్ధి మాత్రం మారలేదు. చేతికి బేడీలతోనే మళ్లీ దొంగతనానికి పాల్పడ్డాడు. అయితే ఈ సారి గ్రామస్తులంతా అప్రమత్తం అవ్వడంతో పట్టుబడ్డాడు.
ఖమ్మం : చేతికి handcuffsతో ఓ నిందితుడు ఠాణా నుంచి తప్పించుకున్నాడు. గంటల వ్యవధిలోనే ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి, అమ్మకానికి పెట్టాడు. జనం పోలీసులకు నిందితుడిని అప్పగించారు. Khammam District నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన కాశి బోయిన గణపతి ఇటీవల పలు ద్విచక్ర వాహనాల Thefts చేశాడు. ఈ నేపథ్యంలో నేలకొండపల్లి పోలీసులు ఆయనను నాలుగు రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నారు. అక్కడి స్టేషన్ నుంచి బుధవారం అర్ధరాత్రి సమయంలో అతడు పరారయ్యాడు. కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో సర్పంచ్ కుమారుడి వివాహం సందర్భంగా గ్రామంలో రద్దీ ఉండడం గమనించాడు.
ఓ ద్విచక్ర వాహనాన్ని దొంగిలించాడు. అదే గ్రామంలో ఉర్లుగొండ వెళ్లే రహదారి వైపు తీసుకెళ్లి బేరం పెట్టాడు. తన వాహనం లేకపోవడంతో వివాహానికి వచ్చిన వ్యక్తి స్థానికంగా తెలిసిన వారందరికీ సమాచారం అందించాడు. అందరూ అప్రమత్తం కావడంతో... వాహనాన్ని విక్రయానికి పెట్టిన వ్యక్తి బండితో సహా పట్టుబడ్డాడు. అతడిని విచారిస్తున్న క్రమంలో అతని చేతికి పోలీసులు కనిపించింది. ఆరా తీయగా అతడు నేలకొండపల్లి ఠాణా నుంచి పరారైన నిందితుడని తెలిసింది. గ్రామస్తుల సమాచారం మేరకు అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేలకొండపల్లి స్టేషన్లో అప్పగించారు. రెండు నెలల క్రితం కూడా ఓ కేసులో నేలకొండపల్లి స్టేషన్కు తీసుకు వచ్చిన ఓ నిందితుడు ఇలాగే పారిపోయాడు.
ఇదిలా ఉండగా, loverతో జల్సా చేయడం కోసం తోడబుట్టిన సోదరి ఇంట్లోనే డబ్బు, నగలను కాజేశాడు ఈ ప్రబుద్ధుడు. అంతేకాదు, తన సోదరి స్కూటీని కూడా దొంగిలించాడు. తన సోదరుడు చేసిన ఘనకార్యం గురించి తెలుసుకున్న సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దొంగ చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన Bhubaneswarలోని చంద్రశేఖర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. జగత్‌సింగ్‌పూర్ జిల్లాకు చెందిన రంజిత్ అనే యువకుడు చంద్రశేఖర్ పూర్ పరిధిలో ఉన్న తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు.
గత కొన్ని నెలలుగా ఓ యువతితో చనువుగా ఉంటున్నాడు. ఇద్దరు జల్సాగా షికార్లు చేశారు. రంజిత్ వద్ద ఉన్న డబ్బు అయిపోయింది. తన ప్రేయసితో కలిసి తిరగడం కోసం సోదరి ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. సోదరుడి పైన నమ్మకంతో, ఇంటి దగ్గరే ఉంటున్నాడని భరోసాతో.. బీరువాకు తాళం వెయ్యకుండా ఆమె బైటికి వెళ్ళిపోయింది. ఆమె బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్న 50 వేల రూపాయల నగదు, బంగారం కనిపించలేదు. బయట చూస్తే స్కూటీ కూడా లేదు. ఇంట్లో వెతికితే రంజిత్ లేడు.
సోదరుడి ప్రవర్తనపై కొద్ది రోజులుగా అనుమానంతో ఉన్న ఆమె ఈ పరిణామంతో రంజిత్ దొంగతనం చేశాడని అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇతగాడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. రంజిత్ దొంగిలించిన సొమ్మును రికవరీ చేసి స్కూటీని కూడా అతని సోదరి ఇచ్చేశారు. అతనిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు క్రిమినల్ బ్యాగ్రౌండ్ పరిశీలించగా రంజిత్ పై పలు పోలీసు స్టేషన్లలో పెండింగ్ కేసులు ఉన్నట్లు తేలింది.
