ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికారుల ఇళ్లలో ఏసీబీ సోదాలు: భారీగా ఆస్తుల గుర్తింపు, కేసులు
సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న ఇద్దరు అధికారులపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఇద్దరు అధికారుల ఇళ్ళల్లో సోదాలు నిర్వహించారు.
సూర్యాపేట: Suryapet,Nalgonda జిల్లాలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఇద్దరు అధికారులపై ఏసీబీ సోమవారం నాడు కేసు నమోదు చేసింది. నల్గొండ జిల్లాలోని నకిరేకల్ Tahsildarతో పాటు సూర్యాపేట జిల్లాలోని పంచాయితీరాజ్ డీఈఈ కరుణసాగర్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.
పంచాయితీరాజ్ డీఈఈ కరుణసాగర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. విల్లాలు, ప్లాట్లు, వావానాలు, ఆభరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. Karuna sagar ఇంట్లో రూ. 25 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకొన్నట్టుగా ఏసీబీ అధికారులు చెప్పారు.
హైద్రాబాద్ శేరిలింగంపల్లి సిటీ ప్లానర్ రాములుపై ఏసీబీ ఇటీవలనే కేసు నమోదు చేసింది. రాములుపై ఆదాయానికి మించి ఆస్తుల కేసును నమోదు చేశారు. 20 చోట్ల ఆస్తులు, రెండున్నర కిలోల బంగారాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. సర్వీస్‌లో పెద్ద మొత్తంలో అక్రమాలు పాల్పడినట్లుగా గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం రూ.40 కోట్ల పైచిలుకు ఆస్తులు వున్నట్లు తేలింది. గురువారం ముసారాంబాగ్‌తో పాటు ఆర్కేపురం, మరో రెండు చోట్ల రాములు నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి.
టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్న నర్సింహ రాములపై ఏసీబీ ఫిర్యాదులు అందడంతో ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, ఆయన కుటుంబీకులకు సంబంధించి వారిపై నిఘా పెట్టింది. దీంతో ఆదాయానికి మించి ఆస్తులు కల్గి ఉన్నట్లు ధృవీకరించుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. నివాసాలు, కార్యాలయాల్లో పలు భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, బినామీ పేరిట కొనుగోలు చేసిన భూములు, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. అయితే ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను శుక్రవారం వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ఈ ఏడాది మార్చిలోరామగుండం ఆర్డీవో శంకర్ కుమార్‌పై ఆదాయానికి మంచిన ఆస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో దాదాపు కోటి రూపాయలకు సంబంధించిన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. ఈ నేపథ్యంలో శంకర్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.ఆయనను రిమాండ్‌కు తరలించారు ఏసీబీ అధికారులు.
2020లో కోవిడ్ నివారణ కొరకు వీధులలో వెదజల్లిన హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారీకి సంబంధించిన బిల్లుల చెల్లింపులో కాంట్రాక్టర్ రజనీకాంత్ వద్ద శంకర్ కుమార్ రూ.లక్ష డిమాండ్ చేశారు. ఈ మేరకు రామగుండం కార్పోరేషన్ ఇంచార్జి కమిషనర్‌గానూ, పెద్దపల్లి ఆర్డీవో గానూ శంకర్ కుమార్ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కాంట్రాక్టర్ రజనీకాంత్ బిల్లుల చెల్లింపు కోసం మద్యవర్తి ద్వారా రూ.లక్ష డిమాండ్ చేయడంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
అధికారుల సలహా మేరకు ఆర్డీవో డిమాండ్ చేసిన లంచం డబ్బును మద్యవర్తిగా ఉన్న ఆర్డీవో అనుచరుడు మల్లికార్జున్‌కు రూ.లక్ష నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా హైడ్రోక్లోరైడ్ ద్రావణం సరఫరాకు సంబంధించిన బిల్లులో సుమారు రూ.9 లక్షల 25వేల చెల్లించాల్సి ఉండగా, రూ.లక్ష డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో తెలంగాణలో అవినీతి అధిాకారులపై ఏసీబీ అధికారులు సోదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.