హైదరాబాద్: 19.39 ఎకరాల భూమిని ఒరిజినల్ పట్టాదారులకు ఇప్పించేందుకు అంజిరెడ్డి మధ్యవర్తిత్వం వహించినట్టుగా ఏసీబీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.
కీసర తహాసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ అధికారుల రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను తెలిపింది. 

19.39 ఎకరాల భూమిని ఒరిజినల్ పట్టాదారులకు ఇప్పించేందుకు కీసర ఎమ్మార్వో నాగరాజుకు పట్టాదారులు శ్రీనాథ్ యాదవ్ కు మధ్య అంజిరెడ్డి మధ్యవర్తిత్వం వహించినట్టుగా రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

అంజిరెడ్డి స్నేహితుడి ఇంట్లో డీల్ కుదిర్చుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు కచ్చితమైన సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు దాడులు చేసి నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

ఈ డబ్బులను శ్రీనాథ్ యాదవ్ అరెంజ్ చేసినట్టుగా రిమాండ్ రిపోర్టులో తెలిపారు.  ఎమ్మార్వో ఇంట్లో సెర్చ్ చేస్తే గుండ్ల పోచంపల్లి గ్రామ పంచాయితీ పరిధిలో ఇళ్ల అనుమతికై 204 పేజీల పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు.

also read:కీసర తహాసీల్దార్ నాగరాజు కేసు: ఐటీ శాఖకు లేఖ రాసిన ఏసీబీ

రాంపల్లిలో దయారా భూ పంచాయితీకి సంబంధించి ఆర్టీఐ నుండి సేకరించిన 105 పేజీల పత్రాలను కూడ స్వాధీనం చేసుకొన్నారు. అంతేకాదు ఓ ప్రజా ప్రతినిధికి చెందిన 63 పేజీల ఆర్జీలను కూడ స్వాధీనం చేసుకొన్నట్టుగా ఏసీబీ అధికారులు తెలిపారు. పలు కేసులు, ఎఫ్ఐఆర్ కాపీలు, కోర్టు ఆర్డర్ కాపీలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

అంతేకాదు అంజిరెడ్డికి చెందిన ఫార్చూనర్ కారు. శ్రీనాథ్ యాదవ్ కు చెందిన కారును కూడ సీజ్ చేసినట్టుగా ఈ రిపోర్టులో ఏసీబీ అధికారులు ప్రకటించారు.