Asianet News TeluguAsianet News Telugu

ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ మధుసూదన్ ఇంట్లో ఏసీబీ సోదాలు: భారీగా నగదు స్వాధీనం

సంగారెడ్డి జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూధన్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ సోదాల్లో ఏసీబీ అధికారులు  భారీగా నగదు స్వాధీనం చేసుకొన్నారు.

ACB Raids at Sanga Reddy Survey Land Record Assistant  Madhusudan house
Author
Hyderabad, First Published Nov 3, 2021, 12:14 PM IST

హైదరాబాద్: లంచం తీసుకొంటూ పట్టుబడిన సంగారెడ్డి సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూధన్ ఇంట్లో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. మధుసూదన్ ఇంట్లో కీలక డాక్యుమెంట్లతో పాటు భారీగా నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

also read:రాజేంద్రనగర్: రూ.5.50 లక్షలు లంచం డిమాండ్... ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్:

భూ సర్వే చేసి డాక్యుమెంట్లు అందించేందుకు ఓ వ్యక్తి నుండి రూ. 20 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులు మధుసూధన్ ను రెడ్ హ్యాండెడ్ గా సోమవారం నాడు పట్టుకొన్నారు. దీంతో ఏసీబీ అధికారులు  మధుసూదన్ కు ఇంట్లో సోదాలు నిర్వహించారు.

మధుసూదన్ కు చెందిన Uppalలో ఆదర్శ్‌నగర్ లో ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. మధుసూదన్ ఇంట్లో భారీగా నగదు, అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. కోటి 3లక్షల నగదు, 314 గ్రాముల బంగారు ఆభరణాలు, 90 లక్షల విలువైన భూపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మధుసూదన్ పై అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో లంచం తీసుకొంటున్న పలువురు అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు కూడ లంచం తీసుకొంటూ సీబీఐకి రెడ్ హ్యండెడ్ తెలంగాణలో చిక్కారు.

ప్రభుత్వ ఆధాయానికి గండికొట్టేలా వ్యవహరింస్తున్న అధికారులపై ఏసీబీ  నిఘా పెట్టింది. గతంలో తెలంగాణకు చెందిన కొందరు అధికారులు కోట్ల రూపాయాల్లో లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి.  రెవిన్యూ శాకు చెందిన కొందరు అధికారులు పెద్ద మొత్తంలో లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కారు. Esiస్కాంలో కోట్లాది రూపాయాల స్కాం జరిగిన విషయాన్ని ఏసీబీ బయటపెట్టింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఈఎఃస్ఐ స్కాం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఏపీ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఈ కేసులో ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన బెయిల్ పై విడుదలయ్యారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios