హైదరాబాద్ (hyderabaad) రాజేంద్రనగర్ (rajendra nagar) సబ్‌రిజిస్ట్రార్ (sub registrar) ఏసీబీ (acb raids) వలలో చిక్కారు. ఓ స్థలానికి సంబంధించి వ్యవహారంలో డీఏజీపీఏ రద్దు కోసం సబ్‌రిజిస్ట్రార్ అర్షద్ అలీ (arshad ali) ఓ వ్యక్తిని రూ.5.50 లక్షలు లంచం డిమాండ్ చేశారు.
హైదరాబాద్ (hyderabaad) రాజేంద్రనగర్ (rajendra nagar) సబ్‌రిజిస్ట్రార్ (sub registrar) ఏసీబీ (acb raids) వలలో చిక్కారు. గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఓ స్థలానికి సంబంధించి వ్యవహారంలో డీఏజీపీఏ రద్దు కోసం సబ్‌రిజిస్ట్రార్ అర్షద్ అలీ (arshad ali) ఓ వ్యక్తిని రూ.5.50 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఈ మొత్తాన్ని డాక్యుమెంట్ రైటర్ వాసు ద్వారా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇంకా రాజేంద్రనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రార్ ఫోన్‌లో కీలక ఆధారాలు వున్నాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఆ ఫోన్‌ను రిజిస్ట్రార్ మాయం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి వుంది.
