Asianet News TeluguAsianet News Telugu

ఏసీబీ వలలో మరో భారీ అవినీతి తిమింగలం..  ఇప్పటివరకు రూ.100 కోట్లు జప్తు.. పలు లాకర్ల గుర్తింపు..  

HYDERABAD: అవినీతి నిరోధకశాఖ వలలో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. హైదరాబాద్ లోని హెచ్‌ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ శివబాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. ఆయన నుంచి ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా స్థిర, చరాస్తులు గుర్తించారు. ఇంకా పలు బ్యాంకుల్లో ఉన్న లాకర్లు తెరవాల్సి ఉంది.

ACB raided S Balakrishna- Secretary TSRERA KRJ
Author
First Published Jan 24, 2024, 11:40 PM IST | Last Updated Jan 24, 2024, 11:40 PM IST

HYDERABAD:  ప్రభుత్వం నుంచి లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్నా.. ఆ జీతం సరిపోనట్టు అవినీతి సోమ్ముకు అలవాటు పడుతున్నారు కొందరు అవినీతి అధికారులు. సందు దొరికితే చాలు.. అందిన కాడికి దోచుకోవడం పరిపాటిగా మార్చుకుంటున్నారు. చిన్న పనైనా సరే.. బల్ల కింద డబ్బుపెట్టనిదే పని జరగని దుస్థితి. లంచాలకు రుచి మరిగిన ఇలాంటి అధికారులు.. ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నారు. తరచూ ఇలాంటి అవినీతి తిమింగలాలు ఏసీబీ అధికారులకు చిక్కుతున్నా.. వారిలో మార్పు రావడం లేదు. తాజాగా మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ చిక్కింది. ఇప్పటి వరకు ఆ అవినీతి అధికారి నుంచి దాదాపు రూ.100 కోట్ల విలువైన అవినీతి ఆస్తులను జప్తు చేశారు. ఇంకా పలు బ్యాంకుల్లో ఉన్న లాకర్లను తెరవాల్సి ఉంది.   

వివరాల్లోకెళ్లే.. బుధవార అవినీతి నిరోధక శాఖ( ఏసీబీ) వలలో మరో అవినీతి తిమింగలం పడింది. హైదరాబాద్ లోని హెచ్ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్ట్ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈక్రమంలో శివబాలకృష్ణ వద్ద ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున నుంచే ఏకకాలంలో 14 బృందాలు విడిపోయి బాలకృష్ణ నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు చేశాయి. ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా స్థిర, చరాస్తులను అధికారులు గుర్తించారు. 

అందులో రూ.40లక్షల నగదు, 2 కేజీల బంగారం, స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలు, 60 ఖరీదైన చేతి గడియారాలు, 14 స్మార్ట్ ఫోన్లు, 10 ల్యాప్‌టాప్‌లు అధికారులు గుర్తించారు. వీటి మొత్తం విలువ రూ.100 కోట్ల  ఉంటుంది.  ఈ అవినీతి తిమింగలం ఇంట్లో డబ్బులను లెక్కించే  కౌంటింగ్‌ యంత్రాలను కూడా గుర్తించారు అధికారులు. ఈ క్రమంలో నాలుగు బ్యాంకుల్లో లాకర్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. 

ఈ లాకర్లను తెరిస్తే.. అవినీతి సొమ్ము ఇంకా పెరిగే అవకాశముందని, గురువారం కూడా తనిఖీలు కొనసాగే అవకాశముందని  ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.  ఆయన హెచ్‌ఎండీఏలో డైరెక్టర్ గా వ్యవహరించిన నాటి నుంచే ఈ ఆస్తులన్నీ కూడబెట్టినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం శివబాలకృష్ట మెట్రో రైల్‌ ప్లానింగ్‌ అధికారి, రెరాలో కార్యదర్శిగానూ కొనసాగుతున్నారు. మరి.. ఇలాంటి అవినీతి తిమింగాలను ఎలా శిక్షించాలో కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని వెల్లడించండి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios