Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నిందితులకు 14 రోజుల రిమాండ్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులైన ముగ్గురికి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్ట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం ముగ్గురు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు.

acb court sentences 14 days remand to three accused in moinabad farm house case
Author
First Published Oct 29, 2022, 10:04 PM IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులైన ముగ్గురికి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్ట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం ముగ్గురు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. అయితే రిమాండ్ ఆపాలని నిందితుల తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. అయితే న్యాయవాది అభ్యర్ధనను తోసిపుచ్చింది ఏసీబీ కోర్ట్.  దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాసేపటి క్రితం నిందితులు నందకుమార్, సింహయాజులు, రామచంద్రభారతిలను రిమాండ్‌కు అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు.. షేక్‌పేట్‌లోని హిల్ టాప్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోర్టు ఆదేశాల మేరకు సైబరాబాద్ సీపీ కార్యాలయానికి తరలించారు. తర్వాత అక్కడి నుంచి మొయినాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి.. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు ముగ్గురు నిందితులను ఏసీబీ కోర్టుకు తరలించారు. నిందితుల తరలింపుకు సంబంధించి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 

Also Read:మొయినాబాద్‌ ఫామ్ హౌజ్‌ కేసు: నిందితులకు హైకోర్టు షాక్, లొంగిపోవాల్సిందే

అయితే నిందితులకు రిమాండ్ విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు.. ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయాలని భావించారు. అయితే ఇదే కేసుకు సంబంధించి బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ జరిపిన హైకోర్టులోని మరో బెంచ్.. పోలీసు దర్యాప్తుపై మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసేవరకు స్టే విధించింది. బీజేపీ పిటిషన్‌పై తదుపరి విచారణను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో నిందితుల కస్టడీకి పిటిషన్ దాఖలు చేయాలనే ఆలోచనను పోలీసులు విరమించుకున్నట్టుగా తెలుస్తోంది.

ఇక, ఈ కేసులో నిందితుల రిమాండ్‌కు సంబంధించి ఏసీబీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ పోలీసులు దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో నిందితుల రిమాండ్ రిజెక్ట్‌ చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్‌కు హైకోర్టు అనుమతించింది. నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీసు కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. నిందితులను అరెస్ట్ చేసి అవినీతి నిరోధక శాఖ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios