హైదరాబాద్: ఈఎస్ఐ స్కాంలో మాజీ డైరెక్టర్ దేవికారాణికి ఏసీబీ కోర్టు సోమవారం నాడు బెయిల్ మంజూరు చేసింది.

ఈఎస్ఐ స్కాంలో దేవికారాణితో పాటు , జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంతలకు కూడ ఏసీబీ కోర్టు సోమవారం నాడు బెయిల్ మంజూరు చేసింది.

 ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణిని ఏసీబీ అధికారులు ఈ నెల 4వ తేదీన అరెస్ట్ చేశారు.ఈఎస్ఐ స్కాంలో గతంలోనే దేవికారాణి అరెస్టైంది. ఇటీవలనే బెయిల్ ఆమె విడుదలైంది. 

అధిక ధరలకు మందుల కొనుగోలు వ్యవహరంలో దేవికారాణితో మరో ఎనిమిది మందిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.మందుల కొనుగోలు రూ.6.7 కోట్లు అక్రమాలు చోటు చేసుకొన్నాయని ఏసీబీ గుర్తించింది. 

ఈ కేసులో దేవికారాణిని ఏసీబీ అధికారులు ఈ నెల 4వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ కేసులో దేవికారాణితో పాటు పద్మ, వసంతలను కూడ ఏసీబీ అరెస్ట్ చేసింది.ఈ ముగ్గురు కూడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఏసీబీ కోర్టు ఈ ముగ్గురికి కూడ బెయిల్ మంజూరు చేసింది.