రూ. 30 వేలు లంచం: ఏసీబీకి చిక్కిన జగిత్యాల ఎస్ఐ శివకృష్ణ
రూ. 30 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు జగిత్యాల ఎస్ఐ శివకృష్ణ.
జగిత్యాల: రూ. 30 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు జగిత్యాల ఎస్ఐ శివకృష్ణ. ముగించిన కేసులో మళ్లీ బాధితులను పిలిచి రూ.50 వేలు డిమాండ్ చేశారని ఎస్ఐ శివ కృష్ణపై బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయమై ఎస్ఐ వేధింపులు భరించలేక బాధితులు ఏసీబీని ఆశ్రయించాడు రాజేష్. ఏసీబీ అధికారుల సూచన మేరకు ఎస్ఐ శివకృష్ణ గురువారం నాడు రూ. 30 వేలు లంచం తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైద్రాబాద్ నగరంలో ఓ ఎస్ఐ ఓ భూ వివాదంలో పెద్ద ఎత్తున లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కారు.
ఈ వ్యవహరం అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది.భూ వివాదంలో రెవిన్యూ అధికారులతో పాటు ఎస్ఐ కూడ అప్పట్లో ముండుపులు తీసుకొన్నారనే ఆరోపణలు కూడ వచ్చాయి. అయితే ఆ తర్వాత ఫిర్యాదుదారుడే తప్పుడు పత్రాలతో భూ వివాదానికి తెర లేపారని తేల్చింది. పోలీసులు లంచం తీసుకొంటూ పట్టుబడడం తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడ చోటు చేసుకొన్నాయి.