బీజేపీతో  తాము ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోబోమని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు.తమది సెక్యులర్ పార్టీ అని  కేటీఆర్ స్పష్టం చేశారు. 


హైదరాబాద్: బీజేపీతో తాము ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోబోమని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు.తమది సెక్యులర్ పార్టీ అని కేటీఆర్ స్పష్టం చేశారు. 

టీఆర్ఎస్ సెక్కులర్ పార్టీ అని కేటీఆర్ చెప్పారు. తాము 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలిపే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. గురువారం నాడు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ నిర్వహించిన లైవ్ షోలో పలువురు నెటిజన్లు వేసిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పారు.

ఇందులో భాగంగా పలువురు నెటిజన్లు వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గంటకు పైగా నెటిజన్లు వేసిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు ఇచ్చారు. 

రాబోయే ఎన్నికల్లో తమకు అధికారాన్ని కట్టబెడితే ఏం చేస్తామనే విషయమై మేనిఫెస్టోలో పొందుపర్చనున్నామన్నారు. ఈ మాసంలోనే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టు చెప్పారు.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల కల్పన, వైద్యం,విద్య తదితర విషయాలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కేటీఆర్ చెప్పారు. 

సంక్షేమ పథకాలకు తమ మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఉంటుందని కేటీఆర్ ప్రకటించారు. గత ప్రభుత్వహయాంలో చేసిన వాగ్దానాలకు సంబంధించి కూడ మేనిఫెస్టోలో పొందుపర్చనున్నట్టు ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రెండు విడతలుగా సాగిన ఉద్యమంలో ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై కూడ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

ట్విట్టర్ వేదికగా నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ జవాబులు (వీడియో)