Asianet News TeluguAsianet News Telugu

ట్విట్టర్ వేదికగా నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ జవాబులు (వీడియో)

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రజల సమస్యలు, సందేహాలను తెలుసుకోడానికి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.  ఆస్క్‌ కేటీఆర్ హాష్‌టాగ్‌తో ట్విట్టర్ వేదికగా తమ   ప్రశ్నలను తెలియజేయవచ్చని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో లైవ్‌షో నిర్వహించారు. యూజర్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ లైవ్‌లో సమాధానాలు ఇచ్చారు.  
 

minister ktr answered netizens questions
Author
Hyderabad, First Published Oct 4, 2018, 7:56 PM IST

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రజల సమస్యలు, సందేహాలను తెలుసుకోడానికి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.  ఆస్క్‌ కేటీఆర్ హాష్‌టాగ్‌తో ట్విట్టర్ వేదికగా తమ   ప్రశ్నలను తెలియజేయవచ్చని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో లైవ్‌షో నిర్వహించారు. యూజర్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ లైవ్‌లో సమాధానాలు ఇచ్చారు.  

ఈ సందర్భంగా కేటీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో దిగజారుడు, అవకాశవాద రాజకీయాలకు కాంగ్రెస్, తెలుగుదేశంలు తెరలేపాయని విమర్శించారు. వీరి కూటమిని తెలంగాణ ప్రజలు తిప్పి కొడతారని కేటీఆర్ జోస్యం చెప్పారు. 

ఈ నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనకు మెచ్చి ప్రజలు తమకే ఓటేసి మరోసారి అధికారాన్ని అప్పగిస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల మేళవింపుగా పార్టీ మేనిఫెస్టో ఉంటుందన్నారు . ఈ దిశగా ఇప్పటికే మేనిఫెస్టో కమిటీ పలు సమావేశాలను జరిపిందన్నారు.

వందల మంది తెలంగాణ యువత ప్రాణాలు బలికొన్న పార్టీ లు, మరోసారి తెలంగాణ ప్రజలను ముంచేందుకు జట్టు కట్టాయని విమర్శించారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల రాజకీయ విమర్శలు ఎన్నడూ లేనంత స్థాయికి దిగజారాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో కనీస విలువలు, మర్యాద పాటించాలన్న సంస్కారాన్ని సైతం ప్రతిపక్ష  పార్టీలు మర్చిపోయాయాన్నారు. ప్రతిపక్షాల స్థాయి దిగజారుడు రాజకీయాలకు తాము సిద్ధంగా లేమన్నారు.  

తాజాగా ఢిల్లీలో రైతులపై జరిగిన లాఠీఛార్జ్ పైన స్పందించిన మంత్రి ఇలాంటి సంఘటనలను తాము పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. రైతాంగానికి, వ్యవసాయరంగానికి తెలంగాణ ప్రభుత్వ పాలసీలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయం అన్నారు. తాము అందిస్తున్న పెట్టుబడి సాయం, రైతు భీమా వంటి వినూత్న పథకాలు దేశ చరిత్రలో నిలిచిపోతాయాన్నారు. 

తెలంగాణకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించామని, రానున్న సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రాధాన్యతా రంగంగా ఎంచుకొని కొనసాగిస్తామన్నారు.  

హైదరాబాద్ నగరంపైన  పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.  ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చేపట్టిన రోడ్ల అభివృద్ధి కార్యక్రమం మరింత వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని, ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చినాక నగరాలు , పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని లక్ష్యంతో ముందుకు పోతున్నామని, ప్రత్యేకంగా ఐటీ కారిడార్ పైన దృష్టి సారించామన్న విషయంలో వాస్తవం లేదన్నారు.

వీడియో

"

Follow Us:
Download App:
  • android
  • ios