అబ్దుల్లాపూర్‌మెట్ డబుల్ మర్డర్: యశ్వంత్, జ్యోతిలను ఇంట్లోనే చంపాలనే స్కెచ్, కానీ...


అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్  పరిధిలోని కొత్తగూడ బ్రిడ్జి వద్ద జరిగిన జంట హత్యల విషయంలో పోలీసుల కీలక విషయాలను గుర్తించారు.యశ్వంత్, జ్యోతిలను ఒకేసారి చంపాలని నిర్ణయించుకొని వారిద్దరిని చంపాడని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కీలకమైన ఆధారాలను సేకరిస్తున్నారు.
 

Abdullahpurmet Double Murder Case Srinivas Failed To Kill Yashwanth And Jyothi In House

హైదరాబాద్: Abdullahpurmet పోలీస్ స్టేషన్ పరిధిలోని Kothagudem బ్రిడ్జి వద్ద జరిగిన జంట హత్యల విషయంలో పోలీసులు సంచలన విషయాలను కనుగొన్నారు.  క్యాబ్ డ్రైవర్ Yashwanth తో తన భార్య Jyothi కి వివాహేతర సంబంధం ఉన్న  విషయాన్ని గుర్తించిన Srinivas ఇద్దరిని ఒకేసారి చంపాలని ప్లాన్ చేసుకొన్నాడు. భర్త ఇంట్లో లేని సమయంలో యశ్వంత్ తో ఇంట్లోనే జ్యోతి ఏకాంతంగా గడిపింది. ఈ విషయాన్ని శ్రీనివాస్ గుర్తించాడు.  ఇంట్లోనే వీరిద్దరిని హత్య చేయాలని కూడా శ్రీనివాస్ ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. అయితే  ప్రియుడు యశ్వంత్ , జ్యోతిని హత్య చేయాలని ప్లాన్ చేసిన శ్రీనివాస్ పిల్లలను Vijayawadaకు పంపారు. మే 1వ తేదీన కొత్తగూడ బ్రిడ్జి వద్ద ఏకాంతంగా ఉన్న యశ్వంత్, జ్యోతిలను హత్య చేశాడు శ్రీనివాప్,

Hyderabad లోని జవహర్ నగర్ కు చెందిన జ్యోతికి విజయవాడకు చెందిన శ్రీనివాస్ కు 16 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. స్టీల్ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు శ్రీనివాస్. యశ్వంత్ తో సంబంధం విషయమై జ్యోతిని భర్త శ్రీనివాస్ పలుమార్లు మందలించాడు. అయితే ఆమె ఈ విషయమై పెద్దగా పట్టించుకోలేదు. యశ్వంత్ తో సంబంధం కొనసాగించింది. ఈ ఇద్దరిని ఒకేసారి Murder చేయాలని శ్రీనివాస్ భావించాడు. ఈ నెల 1వ తేదీన తాను స్నేహితుల ఇంటికి వెళ్తున్నానని శ్రీనివాస్ జ్యోతికి చెప్పారు. ఈ సమాచారాన్ని యశ్వంత్ కు జ్యోతి చేరవేసింది. దీంతో ఈ నెల 1వ తేదీన కొత్తగూడ బ్రిడ్జి సమీపంలో ఏకాంతంగా గడపాలని భావించారు. వీరిద్దరూ బైక్ పై వెళ్తున్న యశ్వంత్, జ్యోతిలను శ్రీనివాస్  వెంబడించాడు. వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో వారిపై దాడి చేశాడు. వీరిద్దరిని హత్య చేసిన తర్వాత శ్రీనివాస్ విజయవాడకు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. విజయవాడలో ఉన్న శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

విజయవాడకు మకాం మార్చాలని శ్రీనివాస్ ప్లాన్

యశ్వంత్ తో జ్యోతి వివాహేతర సంబంధం  కట్ చేయాలంటే విజయవాడకు షిప్ట్ కావాలని కూడా శ్రీనివాస్ భావించాడు. ఈ విషయాన్ని జ్యోతికి కూడా శ్రీనివాస్ కూడా చెప్పారని సమాచారం. మరో వైపు  తనకు  ప్రియుడు యశ్వంత్ తో పాటు భర్త కూడా కావాలని జ్యోతి చెప్పినట్టుగా సమాచారం. ఈ ప్రతిపాదన విన్న శ్రీనివాస్ షాక్ కు గురయ్యారని  తెలుస్తోంది. యశ్వంత్, జ్యోతిలను చంపాలని అవకాశం కోసం చూస్తున్న శ్రీనివాస్ మే 1వ తేదీన అవకాశం రాగానే హత్య చేశారని పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ చెప్పిన విషయాలను పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

ఈ నెల1న  తేదీన విజయవాడకు వెళ్తున్నామని చెప్పి శ్రీనివాస్ భార్య జ్యోతిని తీసుకెళ్లాడు. అయితే యశ్వంత్ ను  చివరి సాగి కలుస్తానని జ్యోతి చెప్పడంతో శ్రీనివాస్ అంగీకరించారని పోలీసుల దర్యాప్తులో గుర్తించారని తెలుస్తోంది.. అయితే ఈ ప్రతిపాదనకు శ్రీనివాస్ కూడా అంగీకరించాడు. ముగ్గురు కలిసి విజయవాడకు బైక్ లపై బయలుదేరారు.. కొత్తగూడ బ్రిడ్జి వద్దకు రాగానే  జ్యోతి, యశ్వంత్ లు ఏకాంతంగా గడిపారు. తన కళ్లముందే వారిద్దరూ ఏకాంతంగా ఉండడంతో తట్టుకోలేక శ్రీనివాస్ చంపాడని తెలిసింది.

ఈ నెల 3వ తేదీన జ్యోతి, యశ్వంత్ మృతదేహాల విషయం ఓ గీత కార్మికుడు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలంలో దొరికిన ఆధారాలతో మృతులు వారాసీగూడకు చెందిన జ్యోతి, యశ్వంత్ లుగా పోలీసులు గుర్తించారు. ఏడాది  నుండి యశ్వంత్ తో జ్యోతి వివాహతేర సంబంధం కొనసాగిస్తుందని పోలీసులు తమ ద్ర్యాప్తులో గుర్తించారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios