Asianet News TeluguAsianet News Telugu

ఇదొక తెలంగాణ గల్ఫ్ కార్మికుడి జిందగీ (వీడియో)

  • గల్ఫ్ లో మిగిలిందేమీ లేదు
  • అవస్థలు పడుతున్నాం
  • పట్టించుకునే నాథుడే లేడు
a tragic story of a telangana gulf worker

గల్ఫ్ లో కార్మికులు ఎంతగా గోసపడుతున్నారో ఈ స్టోరీ చెబుతోంది. ముందుగా వీడియో చూడండి. తర్వాత స్టోరీ పూర్తిగా చదవండి. తెలంగాణ బిడ్డలు ఎడారి దేశంలో ఎంతగా అవస్థలు పడుతున్నారో తెలుస్తుంది.

నాకు నెలకి 1200 దిర్హమ్స్,రూమ్+ ఫ్రీ ఫుడ్ నేను ఉండే ఏరియాలో వంట చేసుకోవటానికి అనుమతి లేదు హోటల్ ఫుడ్ ఎలా ఉంటుందో కంపెనీ ఫుడ్ తినే అన్నలకి తెల్సు... నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం అయిపోయింది. ఒక సంవత్సరం మొత్తంలో నాకు ,నేను చేసిన చుట్టిలు 4 మాత్రమే. గల్ఫ్ లో సాధారణంగా శుక్రవారం అన్ని బంద్ ఉంటాయి. కానీ నా పని అందరికి బంద్ ఉన్న రోజే నాకు ఫుల్ పని ఉంటది. నేను ఇంటికాడినుంచి వచ్చేటప్పుడు ఓన్లీ టికెట్ పైనే వచ్చిన. ఫ్రీ వీసా టికెట్ మాత్రం తీసుకోవాలి అన్నారు. జ్వరం ఒచ్చినా పని చేయడం తప్పదు. తిన్నావా అని అడిగేవారు ఉండరు. ఎవ్వరి డ్యూటీలు వాళ్ళకీ ఎవ్వరి బాధలు వాళ్ళకీ. కానీ ఈడికి అచ్చినంక తెల్సింది. ఫ్రీ వీసా కాదు వీసాకు 3500 దిర్హామ్స్ కట్ చేస్తారని. ఇగ చూడు నా పరిస్థితి నేను వచ్చినప్పుడు బ్యాంక్ రేట్ ఒక దిర్హాం కి 18.75 ఉండే ఎక్సేంజ్ రేట్ లెక్క ప్రకారం విసాకి3500×18.75= 65,625=00 ఇండియా రూపాయలు. అప్పుడు టికెట్ కు 19,835..

మొత్తం 85,460=00,

వచ్చేటప్పుడు ఖర్చులకు అని ఒక 7000లు తెచ్చుకున్న,

ఇగ బట్టలు,దోస్తులు,చుట్టాలు,తాగుడు,తినుడు ఒక 10,000 ఒడిసినయ్.ఖర్చు మొత్తం 1 లక్షలో పడ్డది. నా జీతం 1200లో తక్కువలో తక్కువ200 ఫోన్ ఖర్చు 150 దాకా నా ఖర్చులు అవుతాయి. అన్ని పోను నెలకి మిగిలేవి 850 దిర్హామ్స్ అంటె అక్షరాల ఇండియా15,937=00 రూపాయలు మాత్రమే. ఇదే లెక్క ప్రకారం రెండు సంవత్సరాలకి3,82,500 రూపాయలు. రెండు సంవత్సరాలలో 3,82,500 లో ఒక లక్ష మనం వచ్చిన ఖర్చు ఇప్పుడు 2.82,000. అందులో ఒక్కడు అంటాడు నీకేం మామా దుబాయిల ఉన్నావ్ అని చుట్టాలు అంటారు నాకు అది పంపియ్యు ఇది పంపియ్యు అని.. అందరూ అడిగే వాళ్ళే కానీ ఒక్కరు కూడా ఎలా ఉన్నావ్ ఎలా నడుస్తుంది డ్యూటీ అని అడుగరు.

ఇగ మనం పోయేటప్పుడు ఖర్చులు చూడాలే అది కొని,ఇది తీసుకుని పోయేసరికి 50000 ఆల్కగా ఒడుస్తాయి. ఇగ పోయినక ఉకుంటామా పోయినంకా తెల్లారే 80,000 పెట్టి బండి కొనుక్కచ్చి దోస్తులతో తాగుడు, తిరుగుడు, మన ఏశాలకి ఒక 40,000 లు ఒడిసే మొత్తం కలిపి 1,70,000 వేలు మిగిలినయి 1,12,000 వేలు అన్ని పొంగ తిండి పొట్ట, బట్ట అంతే ఉంది ఈ రోజుల్లో...బతకడం కష్టం అయ్యే రోజుల్లో, జెరంత వెనుకేసుకుందామని, అయ్యవ్వని, తమ్ముని, అక్కచెల్లెల్లని, పెళ్ళాం పిల్లలని, వదిలి వచ్చి ఒక పండుగ లేదు, పబ్బః లేదు పెండ్లిలు లెవ్వు సావులు లెవ్వు తూ ఇదేమ్ బతుకురా అనిపిస్తది ఒకొక్కసారి.

అరేయ్ తమ్ముడు... ఇన్ని నీతులు చెప్పే నువ్వు ఎందుకు ఉంటున్నావ్ రా అంటె ఆశ...ఏ రోజైన జరన్న ఎక్కువ జీతం దోర్కకపోతాడా,,మన స్వంత ఇల్లు మనం కట్టుకోకపోతామ అనే చిన్న ఆశ...మన అయ్యవ్వని మనం సంతోషంగా ఉంచాలని తపన..  చిన్నప్పటి నుండి ఎంత కష్టం చేసి పెంచారో.వాల్ల కోసం ఈ 2 సంవత్సరాలు ఎడారి దేశంలో గడపలేమా అని గుండెకి సర్ది చెప్పకుంటూ బతుకుతున్న,

తన వాల్ల సంతోషమే తన సంతోషంగా బతుకుతున్న గల్ఫ్ అన్నలు కన్నీళ్లు వస్తే తన కన్నతల్లిని గుర్తూ చేస్కొని గుండెలో ధైర్యం నింపుకునే నా గల్ఫ్ అన్నతమ్ములు..

ఇది నా ఒక్కడి బాద కాదు,

ఇలాంటి బాదే ఎంతోమంది గల్ఫ్ అన్నల గుండెల్లో ఉంది. ఇది గల్ఫ్ జీవితం.... ఈ కార్మికుడు తన కష్టాలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో ఉంచారు.  అది ఇప్పుడు వైరల్ అవుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios