ముగిసిన మూడు రోజుల లండన్ పర్యటన.. హైదరాబాద్ కు పయనమైన ఎమ్మెల్సీ కవిత

Hyderabad: తెలంగాణపై తమ నిబద్ధతను మరోసారి చాటుకునేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సిద్ధంగా ఉందని ఆ పార్టీ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖ‌ర్ రావు (కేసీఆర్) కుమార్తె కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించిన తర్వాత ఆమె సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో 'తెలంగాణ పట్ల మా నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించడానికి సిద్ధంగా ఉన్నాం' అని సందేశాన్ని పోస్ట్ చేశారు.
 

A three-day visit to London has ended. MLC Kavitha leaves for Hyderabad RMA

MLC Kalvakuntla Kavitha London Tour: భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన మూడు రోజుల లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ కు పయనమయ్యారు.  బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆహ్వానం మేరకు లండన్ వెళ్లిన కవిత పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్లు - ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల పాత్ర అనే అంశంపై ఆ సంస్థ నిర్వహించిన సమావేశంలో కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేశారు.  లండన్ లోని అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు.

అలాగే, నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమిని - యుకే ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం, రాజకీయాల్లో మహిళల పాత్ర, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ ప్రయాణం వంటి వాటిపై ఆమె తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్నారు. తన లండన్ పర్యటనను ముగించుకొని సోమవారం హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు. లండన్ విమానాశ్రయంలో బీఆర్ఎస్, భారత్ జాగృతి కార్యకర్తలు, ప్రవాస భారతీయులు ఆమెకు వీడ్కోలు తెలిపారు.

ఇదిలావుండ‌గా, భార‌త ఎన్నిక‌ల సంఘం (ఈసీఐ) తెలంగాణ స‌హా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ ను ప్ర‌క‌టించింది. దీనిపై కూడా క‌విత స్పందించారు. తెలంగాణపై తమ నిబద్ధతను మరోసారి చాటుకునేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సిద్ధంగా ఉందని ఆ పార్టీ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖ‌ర్ రావు (కేసీఆర్) కుమార్తె కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించిన తర్వాత ఆమె సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో 'తెలంగాణ పట్ల మా నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించడానికి సిద్ధంగా ఉన్నాం' అని సందేశాన్ని పోస్ట్ చేశారు.

తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదే రోజు ఫ‌లితాలు వెలువ‌డుతాయి. బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios