దేశ ప్రజలను సరైన పద్దతిలో నడిపేందుకు గాను కొత్త రాజకీయ శక్తి రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ ప్రసంగించారు.
హైదరాబాద్: దేశం సరైన పద్దతిలో ముందుకు పోవాలంటే రాజ్యాంగం యథా ప్రకారంగా అమలు కావాలంటే అవసరమైన మౌళిక మార్పులు చేసుకొని అవసరమైన ప్రజల ఎజెండాతో కొత్త రాజకీయ శక్తి దేశంలో ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
బుధవారం నాడు Hyderabad హైటెక్స్ హెచ్ ఐసీసీ లో జరిగిన TRS Plemay లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. అంతకు ముందు ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
సందర్భానుసారంగా ఇండియా స్పందిస్తుందన్నారు.తప్పకుండా కొత్త రాజకీయ శక్తులు పుట్టుకొస్తాయని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ కోసం అవసరమైనప్పుడు టీఆర్ఎస్ ఆవిర్భవించలేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశానికి అవసరమైన సమయంలో కూడా దేశంలో భూకంపం పుట్టించి కొత్త శక్తులు వస్తాయన్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ కూడా సముజ్వలమైన పాత్ర పోషించనుందని కేసీఆర్ చెప్పారు.దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు వ్యతిరేకంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై ప్రజల ఎజెండాతో కొత్త రాజకీయ శక్తి అవిర్భవించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రానికి TRS పెట్టని కోటవంటిందని సీఎం KCR చెప్పారు.బుధవారం నాడు హైద్రాబాద్ హైటెక్స్ హెచ్ ఐసీసీ లో జరిగిన టీఆర్ఎస్ లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. అంతకు ముందు ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ కంచుకోటను ఎవరూ బద్దలు కొట్టలేరన్నారు.
తెలంగాణకు టీఆర్ఎస్ ఒక రక్షణ కవచమన్నారు సీఎం కేసీఆర్.టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి అని ఆయన స్పష్టం చేశారు. అనేక అవమానాలు ఛీత్కారాలు, ఓటములు, గెలుపుల తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత దేశానికే రోల్ మోడల్ గా రాష్ట్రంలో పాలన సాగుతుందని కేసీఆర్ చెప్పారు.దేశంలో పది ఉత్తమమైన గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 10 పల్లెలే ఉన్నాయని సీఎం గుర్తుచ ేశారు. అవార్డులు, రివార్డులు రాని శాఖే తెలంగాణలో లేదని ఆయన చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించామని కేసీఆర్ వివరించారు. అవినీతికి దూరంగా తమ ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. రాష్ట్రంలో అవినీతి మంత్రులు లేరని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లలో 5 లక్షల కోట్లుగా ఉండేదన్నారు. ప్రస్తుతం 11 లక్షల 50 వేల కోట్లతో ముందుకు పోతున్నామన్నారు.
