Asianet News TeluguAsianet News Telugu

ఎలక్ట్రిక్ స్కూటర్‌ల స్కామ్.. తెలంగాణ సహా మూడు రాష్ట్రాల నుంచి 20 మంది నిందితుల అరెస్టు

ఎలక్ట్రిక్ బైక్ విక్రయిస్తామంటూ అమాయకులకు టోపీ పెట్టిన 20 మంది సభ్యులు బృందాన్ని పోలీసులు చేజించుకుని పట్టుకుని విస్తారిస్తాన్నారు. సుమారు 1000 మంది వరకు ఈ 20 మంది నాశనం చేశారని వివరించారు.
 

a fraud offering electric bike sale arrested from three states
Author
First Published Nov 15, 2022, 2:50 AM IST

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ స్కూటర్‌లు అమ్ముతామంటూ కొందరు దుండగులు అమాయకులకు వల వేసి మోసం చేస్తున్నారు. వేల రూపాయాలు కాజేసుకుని పత్తా లేకుండా పారిపోతున్నారు. ఈ స్కామ్‌లో పోలీసులు సోమవారం 20 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరు సుమారు ఒక వేయి మందిని మోసం చేసి ఉంటారని వెల్లడించడం గమనార్హం.

ఈ 20 మంది నిందితుల్లో బిహార్ నుంచి 11 మంది, తెలంగాణ లో నుంచి 4 నిందితులు, జార్ఖండ్‌ నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు ఉన్నటటు పోలీసులు వివరించారు. 

ఈ క్రైమ్‌లో సాధారణంగా బాధితులను తొలుత ఆన్ లైన్ పేమెంట్ ద్వారా రూ. .499 చెల్లించాలని కోరుతారు. ఆ తర్వాత వెహికల్ ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి, ఇన్సూరెన్స్, ఇతర అనేక విషయాలను ప్రస్తావిస్తూ డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరుతారు. ఆ డబ్బులు కూడా ఆ మోసగాళ్లు పొందిన తర్వాత బాధితులు అందరికీ ఒక సమాచారం చెప్పేవారు. వాహనాల డెలివరీ ఇంకా ఆలస్యం అవుతుందని బుకాయిస్తారు. చివరికి వారిని ఫూల్స్ చేస్తారు.

Also Read: Online లో ల్యాప్ టాప్ ఆర్డర్ చేస్తే కంకరాయి డెలివరీలో వచ్చింది..సోషల్ మీడియాలో వైరల్ వీడియో..

నిందితులు టీవీ వెంకటాచలం, నగేశ్ ఎస్పీ, సుశాంత్ కుమార్, రాజేశ్ కుమార్, అమన్ కుమార్, అనిష్, బిట్టూ, సన్ని, నవలేష్ కుమార్, ఆదైత్య, వివేక్ కుమార్, మురారీ కుమార్, అజయ్ కుమార్, అభినాష్ కుమార్, పర్ిన్స్కుమార్ గుప్తా, వాదిత్య చిన్నా, ఆనంద్ కుమార్, కాటర్వాత్ శివ కుమార్, కాట్రావత్ రమేశ్, జీ శ్రీనులు ఉన్నారు. 

వీరి ఫ్రాడ్‌తో రూ. 30,998 కోల్పోయినట్టు చెబుతూ ఫిర్యాదు చేసిన ఓ బాధితుడి ఆరోపణల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో ఒకరు బెంగళూరులో ఉన్నట్టు పోలీసులు కనుక్కున్నారు. ఆ వ్యక్తిని ఇంటరాగేట్ చేయడంతో మొత్తంగా గ్యాంగ్ వివరాలు బయటకు వచ్చాయి. 

ఈ నిందితుల వద్ద నుంచి ఏడు ల్యాప్‌టాప్‌లు, 38 స్మార్ట్ ఫోన్లు, 25 బేసిక్ ఫఓన్లు, రెండు హార్డ్డ డిస్క‌లను పోలీసులు రికవరీ చేసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios