ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి బిగ్ సేల్ ఇప్పుడే ముగిసింది. ఈ ఆన్లైన్ సేల్ లో చాలా మంది డిస్కౌంట్ ధరలకే స్మార్ట్ ఫోన్స్, లాప్ టాప్స్, ఇతర  ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేశారు. అయితే ఓ వ్యక్తికి మాత్రం ఈ ఆన్లైన్ సేల్ చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ల్యాప్ టాప్ ఆర్డర్ ఇస్తే డెలివరీ బాక్స్ లో ఒక పెద్ద రాయి వచ్చింది.  అది చూసిన కస్టమర్ షాక్ కు గురయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చిత్రాలు ఉన్నాయి.

మంగళూరుకు చెందిన చిన్మయ్ రమణ అనే కస్టమర్ తాను దీపావళి సేల్ సమయంలో ల్యాప్‌టాప్‌ను ఆర్డర్ చేశానని, అయితే దానికి బదులుగా బండ రాయి లభించిందని పేర్కొన్నాడు. అయితే, ఒక రోజు తర్వాత డెలివరీ యాప్ ఫ్లిప్‌కార్ట్ తాను చెల్లించిన మొత్తాన్ని వాపసు చేసిందని పేర్కొన్నాడు. దీపావళి సేల్ సందర్భంగా ఇలాంటి అనేక కేసులు తెరపైకి వచ్చాయి.

ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌లో సభ్యుడైన చిన్మయ్ రమణ తన స్నేహితుడి కోసం అక్టోబర్ 15న Asus TUF Gaming F15 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. అక్టోబరు 20న అతనికి సీల్డ్ ప్యాకెట్ వచ్చింది. రమణ తెలిపిన వివరాల ప్రకారం.. పెట్టె తెరిచి చూడగా గేమింగ్ ల్యాప్‌టాప్‌కు బదులు ఒక పెద్ద రాయి. ఎలక్ట్రానిక్ చెత్త కనిపించాయి. దీనికి సంబందించిన చిత్రాలను ట్విట్టర్‌లో పంచుకున్నాడు.

ఫ్లిప్‌కార్ట్ కొత్త సిస్టమ్
దీపావళి సేల్ సీజన్‌లో తప్పుడు ఉత్పత్తి డెలివరీ ఫిర్యాదుల నేపథ్యంలో, ఫ్లిప్‌కార్ట్ 'ఓపెన్ బాక్స్ డెలివరీ' సిస్టమ్‌ను ప్రారంభించింది. దీనితో, కస్టమర్లు తాము ఆర్డర్ చేసిన ఉత్పత్తి వారికి డెలివరీ చేయబడిందా లేదా అని ధృవీకరించుకోగలుగుతారు. ఈ సిస్టమ్ ద్వారా, కస్టమర్ వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని అందించే ముందు బాక్స్‌ను తెరవమని డెలివరీ ఏజెంట్‌ని అడగవచ్చు. ఈ విధంగా వినియోగదారుడు తన ఉత్పత్తిని ధృవీకరించగలరు.

Scroll to load tweet…

చిన్మయ్ విషయంలో, ఓపెన్-బాక్స్ డెలివరీ ఆప్షన్ అందుబాటులో లేదు. అందుకే పెట్టె తెరిచి చూడలేకపోయాడు. అతను ఆర్డర్ చేసిన ఉత్పత్తిని అందుకోనప్పుడు, అతను వెంటనే ఫ్లిప్‌కార్ట్‌కు విషయాన్ని తెలియజేసాడు. డబ్బు వాపసు కోసం అభ్యర్థించాడు. అయితే, ఆ సమయంలో విక్రేత షిప్పింగ్ సమయంలో బాక్స్‌లో ఉత్పత్తి ఉందని పేర్కొంటూ వారి అభ్యర్థనను తిరస్కరించారు.

పూర్తి మొత్తం తిరిగి వచ్చింది
ఆ తర్వాత చిన్మయి ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. కాసేపటికే ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. అప్పుడు ఫ్లిప్‌కార్ట్ బాధ్యత వహించి మొత్తం డబ్బును వాపసు చేసింది. దీని తర్వాత, ఫ్లిప్‌కార్ట్ పూర్తి మొత్తాన్ని రీఫండ్ చేసినట్లు కస్టమర్ సోమవారం తెలియజేశారు.

Scroll to load tweet…

ఇటీవల ఫ్లిప్‌కార్ట్ లో మరో కస్టమర్‌కు ల్యాప్‌టాప్‌కు బదులుగా బాక్స్‌లో సబ్బులు వచ్చాయి. అయితే, ఫిర్యాదు తర్వాత, ఫ్లిప్‌కార్ట్ డబ్బును తిరిగి ఇచ్చింది. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా రాళ్లు, ఇతర పనికిరాని చెత్త వస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. దీని గురించి వినియోగదారులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రాస్తూనే ఉన్నారు.