హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఛానెల్ లైసెన్స్ ను రద్దు చేస్తూ  కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.  

హైదరాబాద్ కు చెందిన ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ కు ఊహించని పరిణామం ఎదురైంది. చట్టవిరుద్ధమైన వార్తా ప్రసార మాధ్యమాలపై భారీ అణిచివేతలో భాగంగా ఆ ఛానెల్ లైసెన్స్ రద్దు చేస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ‘న్యూస్ ఎరీనా ఇండియా’ స్పష్టం చేసింది. గణనీయమైన వ్యూయర్ షిప్ ఉన్న ఛానెల్ కు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. 

విషాదం.. ప్రియురాలికి వివాహమైందని యువకుడి ఆత్మహత్య.. పెళ్లయిన 3 రోజుల తరువాత నవ వధువు కూడా..

సంహిత బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో సంస్థకు 23 గంటల 55 నిమిషాల ఉచిత స్లాట్ ఇవ్వడం సహా ప్రసార నిబంధనలను ఈ ఛానల్ తీవ్రంగా ఉల్లంఘించినట్లు తేలింది. వాస్తవానికి ప్రైమ్ 9 న్యూస్ నియంత్రణలో సంహిత బ్రాడ్ కాస్టింగ్ ఉంది. అయితే పేపర్ పై ఛానల్ ను కలిగి ఉన్న రాయుడు విజన్ మీడియా లిమిటెడ్ కేవలం ఒక ఫ్రంట్ మాత్రమే. ప్రైమ్ 9 న్యూస్ ట్రేడ్‌మార్క్ కూడా సంహిత బ్రాడ్‌కాస్టింగ్ యాజమాన్యంలో ఉంది. 

Scroll to load tweet…

అయితే ఎంఐబీ దాఖలు చేయడానికి ముందు రాయుడు విజన్ మీడియాను ట్రేడ్ మార్క్ యజమానిగా చూపించారు. హైదరాబాద్ లోని పవర్ కారిడార్ కు చాలా దగ్గరగా ఉన్న ఓ వ్యక్తికి ఈ ఛానల్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మా వర్గాలు చెబుతున్నాయని ‘న్యూస్ ఎరీనా ఇండియా’ పేర్కొంది. ప్రైమ్ 9 న్యూస్ ను లైసెన్స్ ను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేయడం వల్ల అక్రమ, అనైతిక మీడియా విధానాలపై ప్రభుత్వం కఠినంగా ఉందనే బలమైన సంకేతాలను పంపుతోంది.