భర్తకు దీక్ష ఇప్పించి కోడలిపై మామ లైంగిక వేధింపులు, బాధితురాలిలా...

A 25 year old woman committs suicide for sexual harassment
Highlights

కోడలిపై లైంగిక వేధింపులు


పెద్దపల్లి: కన్న తండ్రి మాదిరిగా చూసుకోవాల్సిన  మామ కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  ఈ వేధింపులు భరించలేక  ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన  పెద్దపల్లి జిల్లాలో మంగళవారం నాడు సాయంత్రం చోటు చేసుకొంది. ఈ ఘటనపై బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈటూరు గ్రామానికి చెందిన కొమరయ్య కూతురు కోమలతను పెద్దపల్లి జిల్లా మద్దికుంటకు చెందిన ఈర్ల విజయ్ కు ఇచ్చి ఆరు మాసాల క్రితం వివాహం చేశారు.  ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కూడ ఉంది. విజయ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

కోమలతకు విజయ్ దగ్గరి బంధువు. తన తల్లి తరుపున కోమలతకు విజయ్ బంధువు. ఈ కారణంగానే ఈ రెండు కుటుంబాల మధ్య వివాహనికి అంగీకారం తెలిపినట్టు మృతురాలి బంధువులు చెబుతున్నారు. వివాహ సమయంలో విజయ్  కుటుంబసభ్యులకు రూ.15 లక్షలను కట్నకానుకలుగా ఇచ్చారు.

అయితే ఇటీవలనే విజయ్  తన ఉద్యోగాన్ని వదులుకొన్నాడు.హార్వెస్టర్ ను కొనుగోలు చేశాడు. ఆ సమయంలో కోమలత తల్లిదండ్రులు మరో రూ.5 లక్షలను విజయ్ కు సహాయం చేశారు. అయితే విజయ్ తండ్రి కొమరయ్యకు కోడలిపై కన్ను పడింది. ఆమెపై లైంగిక వాంఛ తీర్చుకోవాలనే కోరిక ఏర్పడింది. దీంతో కోడలిని వేధింపులకు గురిచేసేవాడని బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మామ తననను లైంగికంగా ఇబ్బందులకు గురి చేస్తన్న విషయాన్ని ఆమె గ్రామ పెద్దలకు చెప్పింది. గ్రామ పెద్దలు కొమరయ్యను మందలించారు.అయినా అతని వేధింపులు ఆగలేదు. అంతేకాదు కొడుకుకు దీక్షను ఇప్పించాడు. కొడుకు దేవుడి దీక్షలో ఉన్న విషయాన్ని ఆసరాగా తీసుకొన్న కొమరయ్య రెండు మాసాలుగా కోడలిపై మరింతగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

దీంతో మూడు రోజుల క్రితం మరోసారి పంచాయితీ నిర్వహించారు. ఈ పంచాయితీలో మరోసారి గ్రామ పెద్దలు కొమరయ్యను మందలించారు. భర్త, అత్త కూడ వేధింపులకు పాల్పడ్డారని బాధత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక  కోమలత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కోమలత ఆత్మహత్య చేసుకొన్న విషయాన్ని తెలుసుకొన్న భర్త, అత్త, మామలు గ్రామం వదిలేసి పారిపోయారు.  నిందితులను అరెస్ట్ చేయాలని మృతురాలి బంధువులు ఆందోళన నిర్వహించారు.

loader