Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో 15 వేలు దాటిన కేసులు: ఒక్కరోజే 975 మందికి పాజిటివ్, 410 మంది డిశ్చార్జ్

తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. సోమవారం రాష్ట్రంలో 975 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

975 New corona cases reported in telangana
Author
Hyderabad, First Published Jun 29, 2020, 8:50 PM IST

తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. సోమవారం రాష్ట్రంలో 975 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,394కు చేరింది.

ఇవాళ కోవిడ్ 19 కారణంగా ఆరుగురు మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 253కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 9,559 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 5,582 మంది కోలుకున్నారు.

Also Read:అంత్యక్రియల్లో 500 మంది: మృతుడికి కరోనా, భయాందోళనలో గ్రామస్థులు

ఇవాళ ఒక్కరోజే 410 మంది డిశ్చార్జ్ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలోనే సోమవారం 861 మందికి వైరస్ సోకింది. ఆ తర్వాత రంగారెడ్డి 40, సంగారెడ్డి 14, కరీంనగర్ 10, మేడ్చల్ 20, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 4, భద్రాద్రి 8, మహబూబ్‌నగర్ 3, నల్గొండ 2, కామారెడ్డి, యాదాద్రిలో రెండేసి కేసులు, సిద్ధిపేట, ఆసిఫాబాద్, గద్వాల, మహబూబాబాద్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. 

కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన ముగిసింది. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలోని బృందం సీఎస్ తో భేటీ అనంతరం పర్యటనను ముగించింది. అంతకుముందు  గచ్చిబౌలీ లోని టీఐఎంఎస్, గాంధీ ఆసుపత్రి, దోమల్‌గూడలోని దోభీ గల్లీ కంటైన్‌మెంట్ ఏరియాలను సందర్శించింది.

Also Read:రాష్ట్రానికి ఎలాంటి సహాయం చేసేందుకైనా సిద్దమే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్రంలో కోవిడ్ మేనేజ్ మెంట్ పై కేంద్ర బృందం ముందు వైద్య శాఖ అధికారులు  ప్రజేంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో సర్వైలెన్స్ , కంటైన్‌మెంట్ చర్యలు, ఆసుపత్రుల సన్నద్ధత, వైద్య సంరక్షన పరికరాల సమీకరణ, వైరస్ నివారణా చర్యలపై బృంద సభ్యులకు వివరించారు.

రాష్ట్రంలో 17081 బెడ్లు ఉన్నాయని, మరింత మెరుగైన చికిత్స కోసం 4489 అదనపు సిబ్బందిని రిక్రూట్ చేసామని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైద్య మౌలిక సదుపాయలు మెరుగుపరచడం కోసం రూ.475.74 కోట్లు మంజూరు చేశామని కేంద్ర బృందానికి తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios