అంత్యక్రియల్లో 500 మంది: మృతుడికి కరోనా, భయాందోళనలో గ్రామస్థులు
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇటీవలనే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆ యువకుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా వైద్యులు నిర్ధారించారు
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇటీవలనే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆ యువకుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా వైద్యులు నిర్ధారించారు. చనిపోయిన తర్వాత ఈ విషయం తెలిసింది. గ్రామస్తులను హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు ఆదేశించారు.
బొమ్మలరామారం గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి అంత్యక్రియల్లో గ్రామస్తులతో పాటు కుటుంబసభ్యులు, బంధువులు సుమారు 500 మంది పాల్గొన్నారు.
యువకుడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అంత్యక్రియలు పూర్తైన తర్వాత ఆ యువకుడికి కరోనా ఉన్నట్టుగా వైద్యులు ప్రకటించారు. దీంతో యువకుడి అంత్యక్రియలకు హాజరైన వారందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
అంత్యక్రియలకు హాజరైన వారందరిని హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఆదివారం నాటికి 14,419కి చేరుకొన్నాయి. ఆదివారం నాడు ఒక్కరోజే 983 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 816 కరోనా కేసులు రికార్డయ్యాయి.
హైద్రాబాద్ లో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కేంద్ర బృందం జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. కరోనా కేసుల నిరోధాణికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించారు.క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరీక్షించి కేంద్రానికి కేంద్ర బృందం నివేదిక ఇవ్వనుంది.