Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రానికి ఎలాంటి సహాయం చేసేందుకైనా సిద్దమే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి ఎలాంటి  సహాయం చేసేందుకు  తాము సిద్దంగా ఉన్నామని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చారు.

union minister kishan reddy phoned to Telangana CS Somesh kumar
Author
Hyderabad, First Published Jun 29, 2020, 5:25 PM IST

హైదరాబాద్:  కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి ఎలాంటి  సహాయం చేసేందుకు  తాము సిద్దంగా ఉన్నామని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చారు.

సోమవారం నాడు కేంద్ర మంత్రి ఫోన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో మాట్లాడారు. మెడికల్ సెంటర్ గా ఉన్న హైద్రాబాద్ లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కల్గించే పరిణామంగా ఆయన పేర్కొన్నారు. 

చెస్ట్ ఆసుపత్రిలో చోటు చేసుకొన్న ఘటన బాధాకరంగా ఆయన అభివర్ణించారు. చెస్ట్ ఆసుపత్రి ఘటనపై ప్రభుత్వం ఏం చేయబోతుందో  సిఎస్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకొన్నట్టుగా ఆయన తెలిపారు.

దేశంలోని పలు నగరాల్లో కరోనా విజృంభిస్తోందన్నారు. ఢిల్లీ, చెన్నై, ముంబై, హైద్రాబాద్ నగరాల్లో కరోనా తీవ్రంగా ఉందని చెప్పారు. కరోనా పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు లవ్ అగర్వాల్ బృందాన్ని హైద్రాబాద్ కు పంపినట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

లవ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం హైద్రాబాద్ నుండి ఢిల్లీకి వచ్చిన తర్వాత కేంద్రానికి సమగ్రమైన నివేదిక ఇవ్వనుందన్నారు. ఈ విషయమై కేంద్రం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని ఆయన వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios