88 ఫిర్యాదులు.. 24 గంటల్లో వివరణ ఇవ్వాలి: ప్రైవేట్ ఆసుపత్రులకు తెలంగాణ సర్కార్ ఆదేశం

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో కొత్తగా 3,614 మంది కోవిడ్ బారినపడగా.. 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. 

93 percent corona recovery in telangana says health director srinivasa rao ksp

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో కొత్తగా 3,614 మంది కోవిడ్ బారినపడగా.. 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. లాక్‌డౌన్ సమయంలో కరోనా పాజిటివిటి రేటు చాలా తగ్గిందని శ్రీనివాసరావు వివరించారు.

బెడ్స్ ఆక్యూపెన్సీ రేటు 54 శాతం నుంచి 39 శాతానికి తగ్గిందని ఆయన తెలిపారు. తాజాగా 3,961 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారని శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో రికవరీ రేటు 93 శాతం, మరణాల రేటు 0.5 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న జ్వర సర్వేలో 17 వేలకు పైగా బృందాలు పాల్గొంటున్నాయని హెల్త్ డైరెక్టర్ పేర్కొన్నారు.

Also Read:నేనూ డాక్టర్‌నే.. 20 లక్షల బిల్లు ఎందుకైంది: ప్రైవేట్ ఆసుపత్రిని నిలదీసిన మృతుడి చెల్లి

ఆరోగ్య బృందాలు ఇప్పటి వరకు 6 లక్షల ఇళ్లల్లో ఫీవర్ సర్వే చేసినట్లు ఆయన వెల్లడించారు. కొవిడ్‌ ఓపీలో 11,814 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని, ఇప్పటివరకు 64 ప్రైవేటు ఆస్పత్రులపై 88 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. వీటిని పరిశీలించి షోకాజ్‌ నోటీసులు ఇచ్చామన్నారు.  24  నుంచి 48 గంటల్లోగా ఆసుపత్రులు వివరణ ఇవ్వాలని శ్రీనివాసరావు ఆదేశించారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios