Asianet News TeluguAsianet News Telugu

చీరకు నిప్పంటుకుని నిండు గర్భిణీ మృతి.. హైదరాబాద్ లో విషాదం..

ఉదయం ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ స్టవ్ నుంచి మంటలు చెలరేగి శివరాణి (23) కడుపు, కళ్లకు గాయాలయ్యాయి. కాలిన గాయాలతో ఉన్న ఆమెను మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆర్ఎన్ సీ ఆస్పత్రికి తరలించారు. అయితే మంటలకు కడుపులోని శిశువు మృతి చెందాడు. దీంతో శివరాణికి ఆపరేషన్ చేస్తుండగా 23వ తేదీ ఉదయం ఆమె మృతి చెందింది. 

9 months pregnant woman dies after saree set on fire in hyderabad
Author
Hyderabad, First Published Nov 24, 2021, 3:58 PM IST

బాలానగర్ : ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుని ఓ Housewife మృతి చెందిన సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఇన్ స్పెక్టర్ వాహిదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం బాలానగర్ లోని దాసరి బస్తీకి చెందిన శివరాణి, భర్త, పిల్లలతో కలిసి నివాసముంటోంది. ఈ నెల 7వ తేదీన భర్త ఊరికి వెళ్లగా 9 నెలల గర్భవతి అయిన శివరాణి తల్లిదండ్రులతో కలిసి ఉంది. 

అదే రోజు ఉదయం ఇంట్లో వంట చేస్తుండగా Gas stove నుంచి fire చెలరేగి శివరాణి (23) కడుపు, కళ్లకు గాయాలయ్యాయి. కాలిన గాయాలతో ఉన్న ఆమెను మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆర్ఎన్ సీ ఆస్పత్రికి తరలించారు. అయితే మంటలకు కడుపులోని శిశువు మృతి చెందాడు. దీంతో శివరాణికి ఆపరేషన్ చేస్తుండగా 23వ తేదీ ఉదయం ఆమె మృతి చెందింది. ఈ మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఇదిలా ఉండగా, గత నెలలో పాకిస్తాన్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. అయితే ఇది దానంతట అది జరిగిన ప్రమాదం కాకపోవడం విషాదం. కూతురి మీది పగతో కన్నతండ్రే మంటలు అంటించడంతో ఎనిమిది మంది అసువులు బాశారు. 

ప్రపంచం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నా పాకిస్తాన్‌లో ఇంకా అనాగరిక చర్యలు కొనసాగుతూనే వున్నాయి. ముఖ్యంగా ఆ దేశంలో పరువు హత్యల వ్యవహారం తారాస్థాయికి చేరింది. అంతేకాదు.. తమ మాటలను కాదంటే కన్నబిడ్డలనైనా సరే కడతేరుస్తున్నారు తల్లిదండ్రులు. తాజాగా తాను చూపించిన యువకుడిని కూతురు పెళ్లి చేసుకోలేదన్న కోపంతో.. ఇంట్లోని ఎనిమిది మందిని సజీవదహనం చేశాడో కసాయి తండ్రి. 

తారామతిపేట్ హత్యాచారం కేసులో ట్విస్ట్: బంగారం కోసమే ఘాతుకం, భర్తనూ చంపేందుకు స్కెచ్

వివరాల్లోకి వెళితే.. muzaffargad జిల్లాకు చెందిన మంజూర్ హుస్సేన్‌కు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడున్నారు. 2020లో చిన్న కూతురైన ఫౌజియా బీబీ.. మహబూబ్ అహ్మద్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఓ అబ్బాయి పుట్టాడు. ఆ పెళ్లి ఇష్టం లేని మంజూర్.. ఎప్పుడూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే ముజఫర్‌గఢ్‌లోనే ఉంటున్న తన ఇద్దరు కూతుళ్ల ఇళ్లకు తన కొడుకు సాబిర్ హుస్సేన్ తో కలిసి నిప్పు పెట్టాడు.

ఆ మంటల్లో బీబీ, ఆమె నెలల కుమారుడు, పెద్ద కూతురు ఖుర్షీద్ మాయి, ఆమె భర్త, నలుగురు చిన్నారులు కాలిబూడిదయ్యారు. అయితే పని నిమిత్తం బయటికి వెళ్లిన బీబీ భర్త మహబూబ్ అహ్మద్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన రోజే అతడు తిరిగొచ్చాడు. అప్పటికే రెండు ఇళ్లూ మంట్లలో కాలిపోతుండడాన్ని గమనించిన అతడు స్థానికులతో కలిసి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.

ఈ ఘటనపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో మంజూర్, సాబిర్ లను తాను అక్కడే చూశానని, వారిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు  నమోదు చేసుకున్న పోలీసులు.. పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా, పాక్‌లో ఏటా వెయ్యికిపైగా పరువు హత్యలు honor killing జరుగుతున్నట్టు పలు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios