ప్రియురాలి కూతురిపై కన్ను: రఫికా హత్యకు సంజయ్ ప్లాన్ ఇదీ...

రఫికా కూతురిపై కన్నేసిన సంజయ్ ఆమెను దూరం చేసుకోవాలనుకొన్నాడు. ఇదే అభిప్రాయంతో రఫికా కూడ ఉంది. సంజయ్ ను వదలించుకొనేందుకు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. 
 

9 migrant workers killed:accused Sanjay misbehaves with rafikas daughter says warangal cp ravinder

వరంగల్: రఫికా కూతురిపై కన్నేసిన సంజయ్ ప్రియురాలిని దూరం చేసుకోవాలనుకొన్నాడు. ఇదే అభిప్రాయంతో రఫికా కూడ ఉంది. సంజయ్ ను వదలించుకొనేందుకు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. 

సహాజీవనం చేసిన ప్రియురాలితో పాటు ఆమె కూతురిపై కూడ సంజయ్ కన్నేశాడు. ఇది నచ్చని రఫికా ప్రియుడి సంజయ్ ను వదిలించుకోవాలని అనుకొంది. ఇదే అభిప్రాయంతో సంజయ్ ఉన్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని  రఫికా ఒత్తిడి తెచ్చింది. 

దీంతో రఫికాను వదిలించుకోవాలని సంజయ్ భావించాడు. రఫికాను అడ్డు తప్పిస్తే ఆమె కూతురితో సన్నిహితంగా ఉండేందుకు తనకు ఎవరూ కూడ అడ్డుచెప్పేవారు ఉండరని సంజయ్ ప్లాన్ చేశాడు.

also read:ఐదు గంటలపాటు ఒక్కడే: 9 శవాలను ఒక్కటొక్కటే బావిలోకి తోసిన సంజయ్

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్న రఫికాను కడతేర్చాలని సంజయ్ ప్లాన్ చేశాడు. అయితే ఇందులో భాగంగానే రఫికా పెద్దలతో చర్చించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ క్రమంలోనే ఈ  ఏడాది మార్చి 7వ తేదీన నిందితుడు సంజయ్ రఫికాను తీసుకొని గరీబ్ రథ్ రైలులో బెంగాల్ రాష్ట్రానికి బయలుదేరాడు.

తన వెంట సంజయ్ నిద్రమాత్రలు తెచ్చుకొన్నాడు. నిద్రమాత్రలను మజ్జిగలో కలిపి రఫికాకు ఇచ్చాడు. రఫికా నిద్ర మత్తులోకి చేరుకొన్న తర్వాత సంజయ్ ఆమె మెడకు చున్నీ చుట్టి చంపేశాడు. ఆమె మృతదేహాన్ని నిడదవోలు సమీపంలో రైలులో నుండి కిందకు పడేశాడు.ఆ తర్వాత రాజమండ్రి నుండి మరో రైలులో వరంగల్ కు సంజయ్ చేరుకొన్నాడని వరంగల్ సీపీ తెలిపారు. రఫికా ముగ్గురు పిల్లలను పోలీసులు ప్రస్తుతం చిన్న పిల్లల హోంకు తరలించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios