ఐదు గంటలపాటు ఒక్కడే: 9 శవాలను ఒక్కటొక్కటే బావిలోకి తోసిన సంజయ్
మత్తులో ఉన్న మక్సూద్ కుటుంబసభ్యులను గొర్రెకుంటబావిలో పారేసేందుకు నిందితుడు సంజయ్ కుమార్ ఐదు గంటల పాటు శ్రమించాడు. ఈ నెల 21 తేదీ తెల్లవారుజామున పన్నెండున్నర గంటల నుండి ఉదయం ఐదున్నర గంటల వరకు బావిలో మృతదేహాలను బావిలో వేశాడని పోలీసులు చెప్పారు.
వరంగల్: మత్తులో ఉన్న మక్సూద్ కుటుంబసభ్యులను గొర్రెకుంటబావిలో పారేసేందుకు నిందితుడు సంజయ్ కుమార్ ఐదు గంటల పాటు శ్రమించాడు. ఈ నెల 21 తేదీ తెల్లవారుజామున పన్నెండున్నర గంటల నుండి ఉదయం ఐదున్నర గంటల వరకు బావిలో మృతదేహాలను బావిలో వేశాడని పోలీసులు చెప్పారు.
also read:గొర్రెకుంట బావిలో 9 డెడ్‌బాడీలు: పోలీసులకు చిక్కిన క్లూ ఇదీ....
ఈ నెల 20వ తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకు మక్సూద్ ఇంటికి నిందితుడు సంజయ్ కుమార్ సైకిల్‌పై వచ్చాడు. మక్సూద్ కుటుంబంతో పాటు బీహర్ యువకులు వండుకొన్న భోజనంలో నిద్రమాత్రల పౌడర్ ను కలిపాడు. అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో లేచి సంజయ్ కుమార్ చూశాడు. అందరూ కూడ మత్తులో ఉన్నారని గుర్తించాడు. మత్తులో ఉన్న వారిని గోనె సంచిలో మూట కట్టి బావిలో వేశాడు.
మక్సూద్ మినహా మిగిలిన వారంతా కూడ ఎక్కువ బరువు ఉన్న వ్యక్తులు కాకపోవడంతో సంజయ్ ఒక్కడే వారిని బావిలో వేసినట్టుగా పోలీసులు చెప్పారు. ఒక్కొక్కరిని మూట కట్టి బావిలో వేశారని చెప్పారు. తొలుత మక్సూద్ కుటుంబసభ్యులందరిని బావిలో వేశారు. ఆ తర్వాత బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులను కూడ డెడ్ బాడీలను కూడ బావిలో వేశాడు. ఆ తర్వాత
తొమ్మిది మృతదేహాలను బావిలో వేయడానికి ఐదుగంటల సమయం తీసుకొన్నాడని పోలీసులు చెప్పారు. అన్ని మృతదేహాలు బావిలో వేసిన తర్వాత సంజయ్ కుమార్ తాపీగా తాను తెచ్చుకొన్న సైకిల్ పై తిరిగి వెళ్లిపోయాడని పోలీసులు చెప్పారు.
నిందితుడు సంజయ్ కుమార్ కు ఇతరులు ఎవరూ కూడ సహకరించలేదని వరంగల్ సీపీ డాక్టర్ రవీందర్ తెలిపారు. ఒక్కొక్క మృతదేహాన్ని బావిలో వేసిన తర్వాత షకీల్ కు చెందిన పర్సును కూడ తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయినట్టుగా పోలీసులు చెప్పారు.