యాచారంలోని  ఓ ప్రైవేట్  స్కూల్లో  8వ తరగతి  చదువుతున్న   విద్యార్ధి అనుమానాస్పదస్థితిలో మరణించాడు. విద్యార్ధి మృతిపై పోలీసులు విచారణ  జరుపుతున్నారు.

హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని యాచారం లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ప్రజ్వల్ రెడ్డి అనే విద్యార్ధి అనుమానాస్పద స్థితిలో మరణించారుయాచారం ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్ధి ప్రజ్వల్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్కూల్ హస్టల్ లో ప్రజ్వల్ రెడ్డి ఉంటున్నాడు. ప్రజ్వల్ రెడ్డి మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ప్రజ్వల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడా,ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆదివారం నాడు రాత్రి ప్రజ్వల్ రెడ్డి హస్టల్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టుగా బంధువులు చెబుతున్నారు. ప్రజ్వల్ రెడ్డి మృతిపై స్కూల్ వద్ద బంధువులు, కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించారు. ప్రజ్వల్ రెడ్డి మృతికి గల కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.