తెలంగాణలో ఒక్కరోజులో 872 కేసులు, హైదరాబాద్‌లో ఆందోళనకర పరిస్థితులు

తెలంగాణలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. ఇవాళ ఒక్క రోజే 872 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

872 new corona cases reported in telangana

తెలంగాణలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. ఇవాళ ఒక్క రోజే 872 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 8,674కి చేరింది. సోమవారం వైరస్ కారణంగా సోమవారం ఏడుగురు మరణించడంతో... మొత్తం మృతుల సంఖ్య 217కి చేరుకుంది.

రాష్ట్రంలో 4,452 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 4,005 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం ఒక్క హైదరాబాద్‌లోనే 713 మంది కోవిడ్ 19 బారినపడ్డారు.

ఆ తర్వాత రంగారెడ్డి 107, మేడ్చల్ 16, మంచిర్యాల 5, సంగారెడ్డి 12, వరంగల్ అర్బన్ 1, జనగామ, కరీంనగర్, మహబూబాబాద్‌లలో రెండేసి చొప్పున, కామారెడ్డి, మెదక్‌లలో మూడేసి చొప్పున కేసులు నమోదయ్యాయి. 

కరోనాతో కాలాపత్తర్‌లో ఎఎస్ఐగా పనిచేస్తున్న ఎఎస్ఐ యూసుఫ్ మరణించాడు. వారం రోజుల క్రితమే ఆయన కరోనా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. పోలీసు శాఖలో కరోనాతో మరణించినవారి సంఖ్య మూడుకు చేరుకొంది. తొలుత యాదగిరి రెడ్డి అనే కానిస్టేబుల్ మరణించాడు. ఈ నెల 16వ తేదీన హోంగార్డు కరోనాతో మరణించాడు. ఆయన డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో పనిచేసేవాడు.

మే 21వ తేదీన కానిస్టేబుల్ యాదగిరి రెడ్డి కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. తాజాగా కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లో ఎఎస్ఐగా పనిచేస్తున్న యూసుఫ్ కరోనాతో మరణించారు. చికిత్స పొందుతూ ఆయన ఇవాళ ఆసుపత్రిలోనే మరణించాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios