హైద్రాబాద్‌లో బోర్డు తిప్పేసిన ఐటీ సంస్థ: మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు
మాదాపూర్ లో ఓ ఐటీ సంస్థ బోర్డు తిప్పేసింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుండి రూ. లక్షలు వసూలు చేశారు. రెండు నెలల పాటు కూడా ఉద్యోగాల కోసం వచ్చిన అభ్యర్ధులకు శిక్షణ ఇచ్చారు. రెండు వారాలుగా మెయిల్స్, వెబ్ సైట్ ను బ్లాక్ చేసినట్టుగా బాధితులు చెబుతున్నారు.ఈ విషయమై బాధితులు పోలీసులకు పిర్యాదు చేశారు.
హైదరాబాద్: హైద్రాబాద్ Madhapur లో IT Firm సంస్థ బోర్డు తిప్పేసింది. సాప్ట్ వేర్ ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుండి రూ. 2 లక్షలు వసూలు చేశారు. ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి జీతాలు ఇచ్చారని ఓ ఐటీ సంస్థపై బాధితులు ఫిర్యాదు చేసినట్టుగా తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ప్రసారం చేసింది. రెండు వారాల క్రితం కంపెనీ వెబ్ సైట్, మెయిల్స్ ను బ్లాక్ చేసినట్టుగా బాధితులు చెబుతున్నారు. మాదాపూర్ Police Station లో బాధితులు ఫిర్యాదు చేశారు.తమకు న్యాయం చేయాలని కోరింది.
Hyderabad మాదాపూర్ లో ఐటీ సంస్థ బోర్డు తిప్పేసింది. ఈ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తామని కొంత కాలంగా ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సుమారు 800 మంది ఈ సంస్థలో Training కూడా పొందారు. అయితే ఈ సంస్థ బొర్డు తిప్పేసింది. దీంతో బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో సోమవారం నాడు ఫిర్యాదు చేశారు.
గతంలో కూడా ఇదే తరహాలో నిరుద్యోగులను సాఫ్ట్ వేర్ కంపెనీలు మోసం చేసిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఉద్యోగం ఆశాచూపి నిరుద్యోగుల దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసే కంపెనీలు చాలానే ఉన్నాయి. అలాంటి కంపెనీ మరొకటి వెలుగులోకి వచ్చింది. డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగులను బోల్తా కొట్టించింది.
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఓ టెక్నాలజీస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ B.Tech ఫ్రెషర్‌కు ఉద్యోగాలిస్తామంటూ వందలాది మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఒక్కొక్కరి నుంచి 20వేల నుంచి 40 వేల వరకు వసూలు చేసినట్టు బాధితులు ఆరోపించారు. అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చిన నెల రోజుల్లోనే సంస్థ చేతులెత్తేసింది. సంస్థ యాజమాని పరారీలో ఉన్నారు. గతంలో కూడా ఈ సంస్థ ఇలాగే చేసినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన 2021 పిబ్రవరి 26న చోటు చేసుకుంది.
నగరంలోని మాదాపూర్ లో ఓ అనే సాఫ్ట్ వేర్ సంస్థ నిరుద్యోగులకు టోకరా ఇచ్చింది. సుమారు 120 మంది నిరుద్యోగుల నుంచి కోటిన్నర రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడింది. ఈ ఘటన 2017 జూలై 17న చోటు చేసుకుంది.బాధితులు ఈ మేరకు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, సదరు సంస్థకు ఎండీలుగా వ్యవహరిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 27 కంప్యూటర్లు, 12 ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు.