సూర్యాపేట: దేశవ్యాప్తంగా ఓవైపు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతుండగానే మరోవైపు కొందరు మృగాళ్లు దారుణాలను కొనసాగిస్తూనే వున్నారు. ఇలా తాజాగా సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియన ఓ మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఈ దారుణ ఘటన సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడలో చోటుచేసుకుంది. పక్కింట్లో వుండే ఎనిమిదేళ్ల బాలికపై 20ఏళ్ల యువకుడు కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో బాలిక ఒంటరిగా వుందని గమనించిన అతడు బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డాడు. దీంతో భయపడిపోయిన బాలికను అరవకుండా బంధించి నోట్లో గుడ్డలు కుక్కాడు. అనంతరం బాలికపై అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. 

read more  మనవరాలి వయసు బాలికపై వృద్దుడి అత్యాచారం... తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రి పాలు

ఇదే సమయంలో బాలిక తండ్రి ఇంటికి వచ్చి కూతురిపై జరుగుతున్న అఘాయిత్యాన్ని చూశాడు. అతన్న చూసిన యువకుడు బాలికను వదిలిపెట్టి పరారయ్యాడు. 

తన కూతురిపై జరిగిన అఘాయిత్యంపై ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. అభం శుభం తెలియన బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన అతడిని కఠినంగా శిక్షించాలని సూర్యాపేట వాసులు పోలీసులను కోరుతున్నారు.