రాజమండ్రికి చెందిన ఓ దళిత యువతి మృగాళ్ల చేతిలో అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి గురయిన ఘటన మరువకముందే అదే తూర్పుగోదావరి జిల్లాలో మరో అఘాయిత్యం వెలుగుచూసింది. అభం శుభం తెలియన ఓ మైనర్ బాలికపై 55ఏళ్ల వృద్దుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయిన బాలిక హాస్పిటల్ పాలయ్యింది. 

అనపర్తి మండలకేంద్రానికి చెందిన ఓ మైనర్ బాలిక వృద్దుడి చేతిలో అత్యాచారానికి గురయ్యింది. మనవరాలి వయసున్న బాలికపై కన్నేశాడు 55ఏళ్ల వృద్దుడు సత్యనారాయణ రెడ్డి. ఈ క్రమంలో నిన్న(గురువారం) బాలిక ఒంటరిగా వుండగా మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డారు. లైంగిక దాడి కారణంగా బాలికకు తీవ్ర రక్తస్రావం అవడాన్న గమనించిన తల్లిదండ్రులు హాస్పిటల్ కు తరలించారు.

read more  దారుణం.. కరివేపాకు ఆశ చూపి.. 11 బాలికపై అత్యాచారం...

బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెపై అత్యాచారం జరిగినట్లు తెలిపారు. దీంతో బాలికను ప్రశ్నించగా సత్యనారాయణ రెడ్డి బాగోతం బయటపడింది.దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు  సత్యనారాయణ రెడ్డి (55) ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.

ఈ దారుణం గురించి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హుటాహుటిన అనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లి  బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఇవాళ ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు కెఎస్ జవహర్, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే  వనమాడి కొండబాబు బాలికను పరామర్శించనున్నారు.