Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో తెలంగాణాలో 8 రోజుల చిన్నారి మృతి, ఎలా సోకిందో అంతుచిక్కని వైనం!

తెలంగాణాలో కరోనా వైరస్ బారినపడి 8 రోజుల పసికందు మృతి చెందింది. డెలివరీకి ముందు తల్లికి కరోనా వైరస్ లేకపోవడంతో ఆ చిన్నారికి ఆసుపత్రిలో డెలివరీ తరువాత కరోనా వైరస్ సోకిందా లేదా వేరే ఏదైనా కారణం ఉందా అనే దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

8 Days old Baby Dies in Telangana, Source Of Contact Unknown
Author
Hyderabad, First Published May 27, 2020, 9:30 AM IST

తెలంగాణాలో కరోనా వైరస్ బారినపడి 8 రోజుల పసికందు మృతి చెందింది. డెలివరీకి ముందు తల్లికి కరోనా వైరస్ లేకపోవడంతో ఆ చిన్నారికి ఆసుపత్రిలో డెలివరీ తరువాత కరోనా వైరస్ సోకిందా లేదా వేరే ఏదైనా కారణం ఉందా అనే దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

నీలోఫర్ ఆసుపత్రిలో పుట్టిన చిన్నారిని తీసుకొని తల్లిదండ్రులు కుత్బుల్లాపూర్ వెళ్లిపోయారు. కానీ ఇంటికి తీసుకెళ్లిన తరువాత చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని భావించిన తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తిరిగి తీసుకొచ్చారు. 

అక్కడ చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించింది. మరణించిన తరువాత ఆ చిన్నారి కరోనా పాజిటివ్ అన్న విషయం తెలిసింది. ఈ చిన్నారి తల్లిదండ్రులు 10 సంవత్సరాల మాకింద బీహార్ నుంచి వలస వచ్చారు. వారు దినసరి కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 

ఆ చిన్నారి తల్లిదండ్రులను, బంధువులను అందరిని క్వారంటైన్ లో ఉంచారు. ఈ చిన్నారి ఉంటున్న ప్రాంతం కంటైన్మెంట్ జోన్ లో ఉందని అన్నారు. చిన్నారికి వైరస్ ఎలా సోకిందని విషయం గురించి పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్టు తెలిపారు అధికారులు. 

ఇకపోతే.... తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మంగళవారం అమాంతం పెరిగిపోయింది. ఒకే రోజు 71 కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,991కి చేరింది. తెలంగాణలో ఇవాళ కరోనాతో ఒకరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 57కి చేరుకుంది.

అయితే ఒక్కరోజే 120 మంది డిశ్చార్జ్ కావడంతో కోలుకున్న వారి సంఖ్య 1,284కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 650 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 38, రంగారెడ్డి 7, మేడ్చల్‌లో 6 , సూర్యాపేట, వికారాబాద్, నల్గొండ, నారాయణ్ పేట్‌లో ఒక్కొక్కరికి,  మరో 12 మంది వలసకూలీలకు కరోనా సోకింది.

కాగా మార్చి 11వ తేదీ నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. కరోనా పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు విచారణ నిర్వహించింది.

మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు  కొట్టివేసింది. కరోనా పరీక్షల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రెండు సార్లు వచ్చిన లేఖలను సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios