Asianet News TeluguAsianet News Telugu

పేషెంట్ల మందులు కొట్టేసి.. బ్లాక్ మార్కెట్‌కు: హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల దందా

హైదరాబాద్‌లో యాంటీ వైరల్ డ్రగ్స్‌ను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్న మరో ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్లాక్‌లో యాంటీ వైరల్ డ్రగ్స్ అమ్మకాల్లో ప్రైవేటు ఆసుపత్రుల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు

8 arrested for illegally selling antiviral medicines at exorbitant prices in Hyderabad
Author
Hyderabad, First Published Jul 18, 2020, 4:10 PM IST

హైదరాబాద్‌లో యాంటీ వైరల్ డ్రగ్స్‌ను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్న మరో ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్లాక్‌లో యాంటీ వైరల్ డ్రగ్స్ అమ్మకాల్లో ప్రైవేటు ఆసుపత్రుల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

పేషెంట్లకు మందులు ఇచ్చినట్లు ఇచ్చి.. వాటిని కొట్టేసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. పేషెంట్లకు ఇవ్వాల్సిన ఆరు డోసుల్లో కొన్నింటిని కొట్టేసి.. వాటిని బహిరంగ మార్కెట్‌కు తరలించి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

వీరిలో 8 మందిని హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.4 వేల విలువైన మందుల్ని రూ.40 వేలకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.

బ్లాక్‌లో మందుల అమ్మకాల్లో ఎల్‌బీ నగర్, లంగర్ హౌజ్‌లోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల పాత్ర ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది ద్వారా యాంటీ వైరల్ డ్రగ్స్ బయటకు వస్తున్నట్లుగా గుర్తించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios