బుధవారం ఉదయం స్కూలుకు వచ్చిన ప్రియ మధ్యాహ్న భోజన విరామ సమయంలో కనిపించకుండా పోయింది. బాలిక ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేనందున పాఠశాల హెచ్ఎం ధనుంజయ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

అమీర్ పేట : ప్రభుత్వ పాఠశాల(Governament School)కు వచ్చిన విద్యార్థిని అదృశ్యమైన ((Student Missing)సంఘటన ఎస్ఆర్ నగర్ (SR Nagar)పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు సమాచారం మేరకు. యూసుఫ్ గూడ స్టేట్ హోంలోని బాలసదనంలోని ప్రియ అనే బాలిక వెంటళరావునగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. 

బుధవారం ఉదయం స్కూలుకు వచ్చిన ప్రియ మధ్యాహ్న భోజన విరామ సమయంలో కనిపించకుండా పోయింది. బాలిక ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేనందున పాఠశాల హెచ్ఎం ధనుంజయ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఇదిలా ఉండగా, కుళ్లిన స్థితిలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ మృతదేహం లభ్యమైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కుత్బల్లాపూర్ సమీపంలోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన కావలి అనురాధ(22) మూడు నెలలుగా కిరణ్ అనే యువకుడితో కలిసి ఫిలింనగర్ లోని గానిజైల్ సింగ్ నగర్ లోని ఓ ఇంటి రెండో అంతస్తులోని గదిలో నివసిస్తోంది.

Hyderabad Rape: బంజారాహిల్స్ దారుణం... యువతిపై వంటమనిషి అత్యాచారం

కాగా.. ఆమె గది నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి కింద నివసించే కొందరు యువకులు మంగళవారం రాత్రి ఈ విషయాన్ని యజమాని దృష్టికి తీసుకువెళ్లారు. బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు. గదిలోకి వెళ్లి చూడగా ఫ్యానుకు చీరతో వేలాడుతూ కుళ్లిన స్థితిలో అనురాధ మృతదేహం కనిపించింది.

కిరణ్ తో దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉందని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో అతనితో కలిసి నివసిస్తోందని కుటుంబసభ్యులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. అయితే.. కిరణ్ ఆమెను మెసం చేశాడు. ఆమెకు తెలీయకుండా మరో యువతితో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఈ విషయం తెలుసుకొని తీవ్ర మనస్థాపానికి గుురైన అనురాధ ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.