హైదరాబాద్‌కు చెందిన బాలుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్‌ను కలవాలన్నది తన చివరి కోరికగా తెలిపాడు.

నగరానికి చెందిన ఏడేళ్ల బాలుడు మొహమ్మద్ అబ్ధుల్లా హుస్సేన్‌కు క్యాన్సర్ మూడో దశలో ఉంది. అతనికి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అంటే చాలా ఇష్టం. వీలు కుదిరినప్పుడల్లా షేక్ హమ్దాన్ గుర్రపు స్వారీ, స్కూబా డైవింగ్‌ ఇతరత్రా విన్యాసాలకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో పగలు రాత్రి తేడా లేకుండా చూసేవాడు.

Also Read:చివరి కోరిక.. భార్యతో రెండో పెళ్లి, ఆమె చెల్లితో

మొహమ్మద్‌కు తన పరిస్ధితి యొక్క తీవ్ర గురించి తెలియదు. అతను ఎక్కువసేపు కూర్చోలేకపోవడంతో బాలుడిని అతని తల్లిదండ్రులు పాఠశాలకు పంపడం మాన్పించేశారు.

నువ్వు దుబాయ్ యువరాజును ఎందుకు కలవాలని అనుకుంటున్నావని మీడియా ఆ చిన్నారిని ప్రశ్నించింది. తనకు షేక్ హమ్దాను అంటే చాలా ఇష్టమని, ఎందుకంటే అతను ఎల్లప్పుడూ కూల్‌గా, ఉండటంతో పాటు జాలి, దయ కలవాడని పేర్కొన్నాడు.

తనకు అతని పెంపుడు జంతువులను, ధరించే బట్టలను చూడాలనుకుంటున్నాని మొహమ్మద్ తెలిపాడు. దుబాయ్ యువరాజు తమ బాబును కలుస్తాడని తనకు నమ్మకం ఉందని మొహమ్మద్ తండ్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read:జగన్‌ దంపతులను చూస్తేనే నా జన్మ ధన్యం....కిడ్నీ రోగి చివరి కోరిక

ఎందుకంటే అతను నిరుపేదల పట్ల ఎంతో ఉదారంగా ఉంటాడని తమకు తెలుసునని, అతనిని కలవడం వల్ల మొహమ్మద్‌కు కొత్త శక్తి వస్తుందని ఆయన ఉద్వేగంగా చెప్పారు.

ఫాజ్జాగా ప్రఖ్యాతి గాంచిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో చాలా చురుకుగా ఉంటాడు. తను చేసే సాహసాల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ప్రకృతిని అమితంగా ఇష్టపడే హమ్దాన్ తీరిక ఉన్నప్పుడల్లా ప్రపంచంలోని వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటాడు.