తెలంగాణలో కొత్తగా 657 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 704 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 9,787 యాక్టివ్‌ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.   

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,04,478 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 657 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,38,030కు చేరాయి. 24 గంటల వ్యవధిలో ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు తెలంగాణలో కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 3,766కి చేరింది. నిన్న ఒక్కరోజు 704 మంది మహమ్మారి బారి నుంచి కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,24,477కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 9,787 యాక్టివ్‌ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 25, జీహెచ్ఎంసీ 74, జగిత్యాల 22, జనగామ 9, జయశంకర్ భూపాలపల్లి 10, గద్వాల 4, కామారెడ్డి 4, కరీంనగర్ 45, ఖమ్మం 58, ఆసిఫాబాద్ 4, మహబూబ్‌నగర్ 7, మహబూబాబాద్ 16, మంచిర్యాల 43, మెదక్ 5, మేడ్చల్ మల్కాజిగిరి 27, ములుగు 7, నాగర్ కర్నూల్ 6, నల్గగొండ 41, నారాయణపేట 2, నిర్మల్ 3, నిజామాబాద్ 6, పెద్దపల్లి 45, సిరిసిల్ల 21, రంగారెడ్డి 31, సిద్దిపేట 11, సంగారెడ్డి 6, సూర్యాపేట 42, వికారాబాద్ 3, వనపర్తి 4, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ 43, యాదాద్రి భువనగిరిలో 20 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

Scroll to load tweet…