నీలోఫర్ ఆస్పత్రిలో ఆరు నెలల బాలుడి కిడ్నాప్ కేసులో పురోగతి
హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రి నుంచి గురువారం అర్థరాత్రి ఆరు నెలల బాలుడు కిడ్నాప్‌కు గురైన ఘటన కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రి నుంచి గురువారం అర్థరాత్రి ఆరు నెలల బాలుడు కిడ్నాప్‌కు గురైన ఘటన కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తాజాగా ఈ కేసులో కొంత పురోగతి లభించింది. చిన్నారిని ఎత్తుకెళ్లిన మహిళను పోలీసులు గుర్తించారు. ఇక, ఆసుపత్రిలో బాలుడి తల్లి ఫరీదా బేగంతో స్నేహం చేసిన మహిళ పసిబిడ్డను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. సీసీటీవీ ఫుటేజ్‌లో మహిళ పాపను ఎత్తుకెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి. బాలుడి తల్లి ఫరీదాకు మాయమాటలు చెప్పి నిందితురాలు ఈ కిడ్నాప్ చేసిందని గుర్తించారు. ఇక, బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళను పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.
ఇక, ఆసుపత్రిలో ఉన్న ఫరీదా బంధువుల సమక్షంలో ఆమె నుంచి నిందితురాలు బాలుడిని తీసుకుంది. అయితే ఆ తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో ఫరీదా ఆమె బంధువులు బాలుడి కోసం, మహిళ కోసం ముమ్మరంగా వెతికినా ఎక్కడా కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.