Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కొత్తగా 51 కేసులు, ఇద్దరి మృతి: 1,326కి చేరిన సంఖ్య

తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతోంది. తాజాగా మంగళవారం 51 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రకటించింది. ఇందులో 37 జీహెచ్ఎంసీలోనివి కాగా, 14 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు.

51 new coronavirus cases reported in Telangana
Author
Hyderabad, First Published May 12, 2020, 10:13 PM IST

తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతోంది. తాజాగా మంగళవారం 51 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రకటించింది. ఇందులో 37 జీహెచ్ఎంసీలోనివి కాగా, 14 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు. వీటితో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,326కి చేరింది.

ఇవాళ 21 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవ్వడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 822కి చేరగా, మరో 472 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సోమవారం కరోనాతో ఇద్దరు మరణించడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 32కి చేరింది. 

Also Read:కరోనా టైమ్స్: తుమ్ముతూ, చీదుతూ పబ్లిక్ గా కేటీఆర్ వీడియో వైరల్ , అసలు ఏమైంది....?

తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ పబ్లిక్ గా తుమ్ముతూ, చీదుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. దీనిపై ఒక నెటిజెన్ ఏకంగా కేటీఆర్ నే ఈ విషయమై మీకేమైందని అడిగారు. 

ఈ ట్వీట్ కి కేటీఆర్ స్పందిస్తూ.... నిన్న సిరిసిల్ల వెళుతుండగా తానెప్పటినుండో కూడా బాధపడుతున్న ఎలర్జీ వల్ల ఇలా జలుబు చేసిందని, మార్గమధ్యంలో వెనక్కి వెళితే....కార్యక్రమ నిర్వహణలో జాప్యం జరుగుతుందని భావించి వెళ్లినట్టు చెప్పారు. తన వల్ల ఎవరైనా ఇబ్బందులు పడి ఉంటే... తనను క్షమించాలని కేటీఆర్ కోరారు.

Also Read;లాక్‌డౌన్ 4కు సిద్ధంకండి.. మే 18కు ముందే వివరాలు చెబుతా: దేశ ప్రజలతో మోడీ

ఇకపోతే... దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 70 వేల మార్కును దాటింది. గత 24 గంటల్లో 3,604 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 70,756కు చేరుకుంది. 

కాగా, గత 24 గంటల్లో దేశంలో 87 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. దీంతో కరోనా వైరస్ మరణాల సంఖ్య 2,2293కు చేరుకుంది. ఇప్పటి వరకు దేశంలో 22445 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకున్నారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 46,008 ఉంది.  

Follow Us:
Download App:
  • android
  • ios