తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ పబ్లిక్ గా తుమ్ముతూ, చీదుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. దీనిపై ఒక నెటిజెన్ ఏకంగా కేటీఆర్ నే ఈ విషయమై మీకేమైందని అడిగారు. 

ఈ ట్వీట్ కి కేటీఆర్ స్పందిస్తూ.... నిన్న సిరిసిల్ల వెళుతుండగా తానెప్పటినుండో కూడా బాధపడుతున్న ఎలర్జీ వల్ల ఇలా జలుబు చేసిందని, మార్గమధ్యంలో వెనక్కి వెళితే....కార్యక్రమ నిర్వహణలో జాప్యం జరుగుతుందని భావించి వెళ్లినట్టు చెప్పారు. తన వల్ల ఎవరైనా ఇబ్బందులు పడి ఉంటే... తనను క్షమించాలని కేటీఆర్ కోరారు. 

 

 

ఇకపోతే... దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 70 వేల మార్కును దాటింది. గత 24 గంటల్లో 3,604 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 70,756కు చేరుకుంది. 

కాగా, గత 24 గంటల్లో దేశంలో 87 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. దీంతో కరోనా వైరస్ మరణాల సంఖ్య 2,2293కు చేరుకుంది. ఇప్పటి వరకు దేశంలో 22445 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకున్నారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 46,008 ఉంది.  

ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేల 17వ తేదీ వరకు విధించిన లాక్ డౌన్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రులతో మాట్లాడారు. లాక్ డౌన్ ను కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కరోనా వైరస్ కేసులు కొత్తగా నమోదు కాని ప్రాంతాల్లో ఆంక్షలను మరింతగా సడలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, దేశంలో ప్యాసెంజర్ రైళ్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ 15 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.